ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల( Tirumala ) పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఎండాకాలంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
అందుకోసం వేసవికాలంలో భక్తుల రద్దీ కారణంగా రోజుకు శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు కలిపి 55 వేల కేటాయిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.
సర్వదర్శనంలో రోజుకు 10 నుంచి 15 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్, ఏటిసి సర్కిల్లో పాదరక్షకాలు భద్రపరిచే కేంద్రాలను ప్రారంభించామని పీఏసీ 1, 2, 3 నారాయణ గిరి క్యూలైన్లు, రాంభగీచా, సుపథం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద కూడా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమలలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని వెల్లడించారు.

ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని వెల్లడించారు.లేని పక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించమని వెల్లడించారు.అంతేకాకుండా తితిదే పేరిట ఉన్న 52 నకిలీ వెబ్సైట్లు, 13 నకిలీ మొబైల్ యాప్ల( Fake mobile apps )ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా ఈ సందర్భంగా భక్తులను హెచ్చరించారు.నకిలీ వెబ్సైట్ల గురించి తెలిస్తే 155257 కాల్ సెంటర్ కు సమాచారం అందించాలని తెలిపారు.

ముఖ్యంగా చెప్పాలంటే వీకెండ్ కావడం వల్ల తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా భారీగా పెరిగిపోయింది.ఈ శనివారం రోజు శ్రీవారి దర్శనానికి 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.స్వామివారి సర్వదర్శనానికి ఈరోజు 24 గంటల ఆ సమయం పడుతుంది.శుక్రవారం శ్రీవారిని దాదాపు 72,000 మంది భక్తులు దర్శించుకున్నారు.శుక్రవారం రోజు స్వామి వారి హుండీ ఆదాయం దాదాపు మూడు కోట్ల 19 లక్షల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.స్వామివారికి దాదాపు 35 వేల మంది భక్తులు( DevoteeS ) తలనీలాలు సమర్పించారు.