అయ్యప్ప హరివరాసనం పాట ఎలా పుట్టిందంటే..?

శబరిమల( Sabarimala ), ఈ పేరు చెప్తేనే చాలామంది భక్తులు భక్తి భావంతో పొంగిపోతారు.ఇక కార్తీకమాసం వచ్చిందంటే చాలు అందరూ అయ్యప్ప దీక్షపరులతో, అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి.

 How Was The Song Ayyappa Harivarasanam Born, Harivarasanam, Sabarimala, Yesudas-TeluguStop.com

అయ్యప్పను చాలామంది ఎంతో ఇష్టంగా కొలుస్తారు.ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా కూడా అయ్యప్ప స్వామికి ఓ ప్రత్యేకత ఉంది.

అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.అయితే ఈ స్వామికి ప్రత్యేకమైన పాట కూడా ఉంది.

అయితే ఆ ప్రత్యేకమైన పాట ఏమిటంటే పవళింపు పాట.అయ్యప్ప స్వామి హరివరాసనం పాట సీనియర్ గాయకుడు ఏసుదాసు( Yesudas ) పాడారు.అయ్యప్ప స్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు.

Telugu Ayyappa Swamy, Bhakti, Devotional, Harivarasanam, Sabarimala, Vr Gopalami

అయితే ఈ పాట ఎంత విన్నా కూడా తనివి తీరదు.శబరిమల మణికంఠుని సన్నిదానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు.ఇక ఈ పాట ఎలా పుట్టింది? ఎవరు రచించారు? మొదటగా ఎవరు పాడారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎలాంటి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడడం ఒక సంప్రదాయంగా వస్తుంది.

ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ, ఇతర పూజ కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో కూడా ఆలపిస్తారు.ఈ అయ్యప్పస్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్( kumbakudi kulattur ayyar ) రచించడం జరిగింది.

Telugu Ayyappa Swamy, Bhakti, Devotional, Harivarasanam, Sabarimala, Vr Gopalami

అయితే 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారు.ఇక 1940-55 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష కాలంలో విఆర్ గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో జీవిస్తూ ఉండేవాడట.స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసనాన్ని పఠిస్తూ ఉండేవారట.అప్పట్లో ఈశ్వర్ నంభుత్రి అనే తాంత్రి స్వామి వారికి పూజలు చేస్తూ ఉండేవారు.ఆ తర్వాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్లిపోయాక అతను మరణించాడు అనీ తెలుసుకొని, తీవ్రంగా బాధపడి, దుఃఖించిన ఈశ్వర్ నంభుత్రి తాంత్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివేవారట.ఇక అప్పటినుండి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube