గోవింద నామానికి గల అర్థాలు ఏమిటి?

‘గో’ అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి.స్వర్గేషు పశు వాగ్వజ, దిబ్ర్నేత్రఘృణి భూజలే – అని అమర కోశం, స్వర్గం, బాణం, పశువు, వాక్కు, వజ్రాయుధం, దిక్కు, గోపురం… నేత్రం, కిరణం, భూమి, నీరు అని పలు అర్థాలను ‘గో’ శబ్దానికి చెబుతారు.పై అర్థాలలో కొన్ని ‘గోవింద’ నామంలోని ‘గో’ శబ్దానికి అన్వయిస్తాయి.“త్వం గవామింద్రతాం గతః గోవింద ఇతి లోకాస్వాం స్తోష్యంతి భువి శాశ్వతమ్” అన్న ప్రమాణాన్నిబట్టి గోవులకు ప్రభువైన కృష్ణుడు గోవిందుడు అయ్యాడు.గోవులను కాపాడే వాడు అని కూడా చెప్పవచ్చు.

 Do You Know The Meaning Of Govinda Namam , Devotional, Govindha Namalu, Govindha-TeluguStop.com

గోభిరేవయతో వాచ్యో గోవింద స్స ఉదాహృతః.అని మరొక ప్రమాణాన్ని అనుసరించి వేద వాక్కులచే ప్రతిపాదింపబడే వాడు గోవిందుడు.వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః… అని భగవద్గీత కూడా ఈ విషయాన్నే చెప్పింది.హిరణ్యాక్షునిచే అపహరింప బడిన భూదేవిని తిరిగి పొందిన వాడు గాన గోవిందుడు.ఈ రీతిగా గోవింద శబ్దాన్ని వారు కారణం కల అర్థాలను గ్రహించి గోవింద శబ్దాన్ని అర్ధం చేసుకోవాలి.‘కిరణం’ అనే అర్థాన్ని గ్రహించి తేజోమూర్తి అని కూడా వివరించవచ్చు.

శ్రీనివాస గోవిందా || శ్రీ వేంకటేశా గోవిందా గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా భక్తవత్సల గోవిందా || భాగవతాప్రియ గోవిందా నిత్యనిర్మల గోవిందా|| నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా || పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా || నవనీతచోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా || పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా || దురతనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా || కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా || వరాహమూర్తీవి గోవిందా గోపీజనలోల గోవిందా || గోవర్ధనోద్ధార గోవిందా దశరధనందన గోవిందా || దశముఖమర్ధన గోవిందా పక్షివాహనా గోవిందా || పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మ గోవిందా || మధుసూదనహరి గోవిందా వరాహనృసింహ గోవిందా || వామనభృగురామ గోవిందా బలరామానుజ గోవిందా || బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా || వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా || శ్రితపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా || ధర్మసంస్థాపక గోవిందా అనాథరక్షక గోవిందా || ఆపధ్భాందవ గోవిందా శరణాగతవత్సల గోవిందా || కరుణాసాగర గోవిందా కమలదళాక్షా గోవిందా || కామితఫలదాత గోవిందా పాపవినాశక గోవిందా || పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా || శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా || దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా || ప్రసన్నమూర్తి గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా || మర్త్యావతారాగోవిందా శంఖచక్రధర గోవిందా|| శారంగదాధర గోవిందా విరాజతీర్థ గోవిందా || విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా|| సహస్రనామ గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా || లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవిందా || కాంచనాంబరధర గోవిందా గరుడవాహనా గోవిందా|| గజరాజరక్షక గోవిందా వానరసేవిత గోవిందా || వారథిబంధన గోవిందా ఏడుకొండల వాడా గోవిందా || ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా || రఘుకులనందన గోవిందా ప్రత్యక్షదేవ గోవిందా || పరమదయాకర గోవిందా వజ్రమకుటదర గోవిందా || వైజయంతిమాల గోవిందా వడ్డీకాసులవాడా గోవిందా || వాసుదేవతనయాగోవిందా బిల్వపత్రార్చిత గోవిందా || భిక్షుకసంస్తుత గోవిందా స్త్రీపుంరూపా గోవిందా || శివకేశవమూర్తి గోవిందా బ్రహ్మానందరూపా గోవిందా || భక్తరక్షక గోవిందా నిత్యకళ్యాణ గోవిందా || నీరజనాభా గోవిందా హతిరామప్రియ గోవిందా || హరిసర్వోత్తమ గోవిందా జనార్ధనమూర్తి గోవిందా || జగత్సాక్షిరూపా గోవిందా అభిషేకప్రియ గోవిందా || అపన్నివరణ గోవిందా నిత్యశుభప్రద గోవిందా || నిఖిలలోకేశా గోవిందా ఆనందరూపా గోవిందా || ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా || ఇ భారాజరక్షక గోవింద పరమదయాల్లో గోవిందా || పద్మనాభాహరి గోవిందా గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా తిరుమలవాసా గోవిందా || తులసీవనమాల గోవిందా శేషశాయి గోవిందా || శేషాద్రినిలయ గోవిందా శ్రీ శ్రీనివాసా గోవిందా || శ్రీవేంకటేశా గోవిందా గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః||

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube