భూమి మీద జీవిస్తున్న ప్రజలలో ఏ ధర్మాన్ని అనుసరిస్తున్న వారైనా అవసరంలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి భోజనం( Food ) పెట్టడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు.దీని వెనుక కేవలం అవసరం ఉన్నవారికి సహాయం అందించడం మాత్రమే కాదు మన మంచి కర్మలు చేసే అవకాశం కూడా ఉందని హిందూ ధర్మం బోధిస్తోంది.
ఈ రకంగానే మూగజీవులకు( dumb creatures ) కావాల్సిన దాణా అందించడం కూడా మంచి పుణ్యఫలమే అని పండితులు చెబుతున్నారు.
ఏ పశువుకు ఎలాంటి దాణా అందిస్తే గోచార రీత్యా ఇలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ ధర్మం ప్రకారం ఆవును( cow ) చాలా పవిత్రంగా చాలామంది ప్రజలు భావిస్తారు.కొంతమంది గోపూజ కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు.
ఆవుకు దాణా అందించడం ద్వారా కుండలిలో ఉన్న గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు.సంపద, వంశాభివృద్ధి ఆశించేవారు ఆవుకు పచ్చ గడ్డి, గోధుమ పిండితో చేసిన మిఠాయిలు తినిపించడం ఎంతో మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే యుగాలుగా ఏ హాని చెయ్యని జీవులకు దాణా వేయడం సాధారణంగా వస్తూనే ఉంది.శత్రు పీడ, కష్టాల నుంచి బయటపడేయడానికి చేపలకు ఆహారం అందించడం ఒక సులభమైన మార్గం.అప్పులు చాలా ఎక్కువగా ఉండి అవి తీర్చడానికి ఇబ్బంది పడుతుంటే గోధుమ పిండితో చేసిన ఉండలు లేదా ఎండు మొక్కజొన్న గింజలు తప్పకుండా చేపలకు ఆహారంగా వేయాలి.ఈ ఆహారం చేపలకు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయానికి తర్వాత అందించడం మంచిది.
పక్షులకు గింజలు, నీరు అందించడం కూడా ఎంతో ముఖ్యం.పక్షులకు జొన్నలు, సజ్జగింజలు వేయడం వల్ల మీ చదువు, కెరీర్ కు సంబంధించిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా పక్షులకు ఆహారం అందించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.మీ డాబా పై లేదా ఆరు బయట పక్షుల కోసం నీరు,ధాన్యాలు ఉంచడం ద్వారా ఇంట్లోకి సమృద్ధి, విజయం వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.