తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు.ఎన్నో చిత్రాల్లో ఎన్నో అద్భుత పాత్రలు పోషించారు ఆయన.సుమారు నాలుగు దశాబ్దాల పాటు విలన్ గా, కమెడియన్ గా చక్కటి ప్రతిభ కనబర్చాడు.ఆయన నటనకు జనాలు ఎంతో మంది అభిమానులుగా మారారు.
సినిమా పరిశ్రమలో ఆయన ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి.అదే సమయంలో ఎన్నో అవమానాలు కూడా ఎదురయ్యాడు.
ఇంతకీ కోటాకు ఎదురైన చెడ్డ ఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.అందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు.
అందులో భాగంగానే జంబలకిడిపంబ సినిమా గురించి వివరించాడు.కేవలం 50 లక్షల రూపాయలతో ఈవీవీ ఈ సినిమాను అద్భుతంగా తెరెక్కించినట్లు వెల్లడించాడు.
ముఖ్యంగా ఆగవాళ్లను మగవాళ్లుగా.మగవాళ్లను ఆడవాళ్లుగా వ్యవహరించేలా ఆయన సినిమా తీసిన విధానం అప్పట్లో అద్భుతం అనిపించింది.
ఒకరోజు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కోటా శ్రీనివాసరావుతో ఈ సినిమా కథ చెప్పాడు.కథ కొత్తగా అనిపించింది.
అయితే ఈ సినిమాలో కోటాతో పాటు మిగిలిన కమెడియన్స్ అంతా 15 రోజుల పాటు విశాఖ వీధుల్లో మంగళసూత్రం మెడలో వేసుకుని తిరిగాల్సి ఉంటుంది.
ఈ విషయం తెలిసిన ఓ స్టార్ డైరెక్టర్ ఇలాంట చెత్త సినిమాలు చేయడం కంటే వ్యభిచారం చేసుకోవచ్చు కదా అంటూ విమర్శించాడట.ఈ విషయం దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు తెలిసింది.ఇదే విషయాన్ని కోటా శ్రీనివాసరావుతో చెప్పుకుని చాలా బాధపడ్డాడట.
అయితే కోటా మాత్రం ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడట.ఈ సినిమా విడుదల అయ్యాక అందరి నోళ్లు మూత పడుతాయి అని చెప్పాడట.
అనుకున్నట్లుగా సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది.ఈ సినిమా విజయంతో ఆ మాటలన్న స్టార్ డైరెక్టర్ మౌనంగా ఉండిపోయాడట.
ఈ సినిమా విజయంతో తామంతా చాలా సంతోషపడినట్లు చెప్పారు కోటా.