జుట్టు రాలడం( hair loss ) అనేది దాదాపు అందరూ ఎదుర్కొనే కామన్ సమస్య.అయితే కొంత మందిలో మాత్రం చాలా హెవీగా హెయిర్ ఫాల్ ఉంటుంది.
ఈ సమస్య నుంచి బయటపడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఏవేవో ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
అయితే జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో బియ్యం నీరు చాలా బాగా సహాయపడతాయి.అందులోనూ నేరుగా కాకుండా బియ్యం నీటిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ జుట్టు ఊడమన్నా ఊడదు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ బియ్యం( Rice ) నానబెట్టుకున్న వాటర్ ను పోసుకోవాలి.వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry leaves ), ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు( onion slices ), ఐదు నుంచి ఆరు లవంగాలు( Six cloves ) వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి ఇది మంచి హెయిర్ టానిక్ మాదిరి పని చేస్తుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఇలా చేశారంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.ఈ న్యాచురల్ టానిక్ లో ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి.ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి.
మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.జుట్టు వేగంగా, మందంగా పెరగడానికి సహాయపడతాయి.
జుట్టును మరింత మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అంతేకాకుండా ఈ టానిక్ ను వాడడం వల్ల చుండ్రు సమస్య కూడా దూరం అవుతుంది.