బాడీలో వ్యర్థాలు( Waste in the body ).ఆహారం, శ్వాస మరియు ఇతర జీవక్రియల ద్వారా ఏర్పడే పదార్థాలు.
ఇవి శరీరానికి అవసరం లేనివి.వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
లేకుంటే అనారోగ్యానికి దారితీయవచ్చు.ముఖ్యంగా కిడ్నీ, కాలేయం వంటి అవయవాల పని తీరు దెబ్బతింటుంది.
మరిన్ని అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతాయి.ఈ నేపథ్యంలోనే బాడీలో వ్యర్థాలను సులభంగా తొలగించేందుకు సహాయపడే సూపర్ జ్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక మీడియం సైజ్ బీట్ రూట్( Beet root ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక లెమన్( Lemon ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు మరియు నిమ్మ ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger slices ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగేయడమే.

ఈ బీట్ రూట్ లెమన్ జ్యూస్ ఒక డిటాక్స్ డ్రింక్ మాదిరి పని చేస్తుంది.వారానికి కనీసం రెండు సార్లు ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.రక్త శుద్ధి జరుగుతుంది.
కిడ్నీ, కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.అలాగే బీట్‌రూట్‌లోని నైట్రేట్లు మెదడుకు రక్త ప్రసరణను పెంచి.
మేధాశక్తిని రెట్టింపు చేస్తాయి.

నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి మరియు బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.తక్కువ క్యాలరీలు ఉండడం మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఈ జ్యూస్ బరువు తగ్గాలనుకునేవారికి కూడా మంచి ఎంపిక అవుతుంది.
అంతేకాకుండా ఈ జ్యూస్‌లోని పోషకాలు శరీర శక్తిని పెంచి, అలసటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.