బొప్పాయి ( papaya )ఆరోగ్యానికి ఒక వరమనే చెప్పుకోవచ్చు.ఈ సూపర్ ఫ్రూట్ లో ఉండే పోషక విలువలు.
అవి మన ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.లో కేలరీ, హై న్యూట్రిషన్ కలిగిన బొప్పాయిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు అందం రెండూ పెరుగుతాయి.
అయితే ఎంత మేలు చేసినప్పటికీ.బొప్పాయి పండును తినేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
లేదంటే డేంజర్ లో పడతారు జాగ్రత్త.బొప్పాయి పండును వీలైనంత వరకు డే టైమ్‌లోనే తినండి.
రాత్రివేళ బొప్పాయి తినడం సరైన ఎంపిక కాదు.రాత్రి పూట బొప్పాయి తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు నొప్పి( Digestive problems, gas, stomach pain ) వంటివి తలెత్తవచ్చు.

అలాగే బొప్పాయి పండు మరియు పాలు( milk ) ఒకేసారి లేదా కలిపి తీసుకోకూడదు.బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ పాలతో కలిసినప్పుడు జీర్ణాశయంలో అసమతుల్యత ఏర్పాడుతుంది.అదే సమయంలో మరికొన్ని జబ్బులకు కూడా బొప్పాయి-పాలు కాంబినేషన్ కారణం అవుతుందనే నమ్మకం ఆయుర్వేదంలో ఉంది.పచ్చి లేదా పూర్తిగా పండని బొప్పాయి తినకపోవడమే ఉత్తమం.పచ్చి బొప్పాయిలో పేపైన్ అనే రసాయనం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.ఇది కొందరికి అల్లర్జీ, జీర్ణ సమస్యలను కలిగించవచ్చు.
పచ్చి లేదా పూర్తిగా పండని బొప్పాయి గర్భిణీలకు మరింత ప్రమాదకరం.

బొప్పాయి తిన్న వెంటనే చల్లటి నీరు లేదా ఇతర చల్లటి పదార్థాలను పొరపాటున కూడా తీసుకోకూడదు.అలా తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలు రావచ్చు.బొప్పాయితో పాటు ఆరెంజ్, లెమన్ ( Orange, lemon )వంటి సిట్రస్ ఫ్రూట్స్ ను తినడం చాలా డేంజర్.
బొప్పాయి లో తక్కువ యాసిడ్ ఉంటుంది, కానీ లెమన్ లేదా అరెంజ్ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఎక్కువగా కలిగి ఉంటాయి.రెండింటిని కలిపి తినడం వల్ల పేగులపై ఒత్తిడి పెరిగి.
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.