అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి… అందంగా కనిపించాలని ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అని తేడాలేకుండా అందం కోసం పోటీ పడుతున్నారు.అలాంటి అందాన్ని పెంచే వివిధ రకాల క్రీములు మార్కెట్లోకి వచ్చేది లేటు, వాటిని కొని ఉపయోగించి వారి అందం రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఫేస్ ప్రొడక్ట్స్ కొందరు శరీరానికి పడక పోవడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.అలాంటి వారు చిన్న, చిన్న చిట్కాల ద్వారా వారి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు…
ప్రస్తుతం కరోనా సమయం వల్ల అందరూ ఇళ్ల కే పరిమితమై వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కరోనా నుంచి కాపాడుకోవడానికి ఎక్కువమంది ఆవిరి పట్టుకోవడం అలవాటుగా చేసుకున్నారు.ఈ ఆవిరి పట్టడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా, అందం కూడా రెట్టింపవుతుంది.
అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఆవిరిని పట్టుకుంటారు.
ఆవిరి పట్టుకోవడం ద్వారా శ్వాస తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.అలా ఆవిరి పట్టుకునేటప్పుడు మన మొహం లో ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
అంతేకాకుండా మన శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందడంతో, శరీర భాగాలకు రక్తం సరఫరా మెరుగు పడుతుంది.
మొటిమల సమస్యలతో బాధపడేవారు, డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ వంటి వారు కూడా ఆవిరిని పట్టుకోవడం ద్వారా దుమ్ము ధూళి కణాలు తో మూసుకుపోయిన చర్మరంధ్రాలు తెరుచుకుని మృతకణాలను తొలగించడం వల్ల మన చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు స్టీమింగ్ కు దూరంగా ఉండటం మంచిది.అయితే కేవలం ఆరు నిమిషాల పాటు మాత్రమే స్టీమింగ్ ని పెట్టుకోవడం వల్ల ఎంతో ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తాయి.
స్టీమింగ్ తర్వాత మన మొఖాన్ని మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి.ఈ విధమైన చిన్న చిట్కాను ఉపయోగించడం వల్ల కాంతివంతంగా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.