అతిగా యాడ్స్ వేయడంతో పీవీఆర్ - ఐనాక్స్కి షాక్ ఇచ్చిన వినియోగదారుడు!

అవును, మీరు విన్నది నిజమే.బెంగుళూరులోని వినియోగ‌దారుల కోర్టు.

 A Customer Shocked Pvr - Inox By Showing Too Many Ads!, Bangalore, Man, Inox, Co-TeluguStop.com

పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ థియేట‌ర్ ఓన‌ర్ల‌కు భారీ జ‌రిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సంబంధిత స‌మ‌యానికి చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా.

దాదాపు 25 నిమిషాల పాటు యాడ్స్‌ను ఏకధాటిగా ప్రదర్శించడంతో, త‌న విలువైన స‌మ‌యం దారుణంగా వృధా చేశారని ఓ సినీ ప్రేక్ష‌కుడు దాఖ‌లు చేసిన కేసులో క‌న్జ్యూమ‌ర్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో టికెట్‌పై ఉన్న స్క్రీనింగ్ సమయానికే సినిమాను స్టార్ట్ చేయాల‌ని, ఆల‌స్యం చేసినందుకు జ‌రిమానా క‌ట్టాల‌ని కోర్టు పీవీఆర్ – ఐనాక్స్కి ఆదేశించింది.

Telugu Bangalore, Complaint, Inox-Latest News - Telugu

విషయంలోకి వెళ్తే.బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ ఎంఆర్ అనే వ్య‌క్తి 2023 డిసెంబ‌ర్‌లో “సామ్ బ‌హ‌దూర్” చిత్రాన్ని చూసేందుకు మ‌రో ఇద్ద‌రితో క‌లిసి పీవీఆర్ – ఐనాక్స్కి టికెట్ తీసుకొని వెళ్లాడు.ఆ ఫిల్మ్ 4.05 నిమిషాల‌కు ప్రారంభమై.6.30 నిమిషాల‌కు పూర్తి కావాల్సి ఉంది.సినిమా ముగిసిన త‌ర్వాత అత‌ను మ‌ళ్లీ తన పనికి తాను వెళ్లాల్సి ఉంది.కానీ ఆ రోజు చిత్రాన్ని 4.30 నిమిషాల‌కు స్టార్ట్ చేసినప్పటికీ… యాడ్స్‌, ట్రైల‌ర్స్‌తో ఇంకాస్త ఆల‌స్యం చేశారు.కట్ చేస్తే, దాదాపు 30 నిమిషాల పాటు సినిమా ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది.

దీంతో సినిమా పూర్తి కావ‌డానికి కూడా మ‌రింత స‌మ‌యం పట్టింది.సినిమా ఆల‌స్యంగా స్ట్రీమింగ్ చేయ‌డం వ‌ల్ల‌ త‌న అపాయింట్‌మెంట్ షెడ్యూల్‌ను మిస్సైన‌ట్లు ఫిర్యాదులో సదరు వ్య‌క్తి పేర్కొన్నాడు.

Telugu Bangalore, Complaint, Inox-Latest News - Telugu

కాగా ఈ కేసులో ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన క‌న్జ్యూమ‌ర్ కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ… ఇత‌రుల స‌మ‌యాన్ని వృధా చేసి, ల‌బ్ధి పొందే హ‌క్కు ఇక్కడ ఎవ‌రికీ లేదు.25 నుంచి 30 నిమిషాల పాటు థియేట‌ర్‌లో ఖాళీగా కూర్చోవడం అంటే అది ఎదుటివారి సమయాన్ని వృధా చేయడమే అవుతుంది! ఈ రోజుల్లో సమయమే డబ్బు.కాబట్టి ఫిర్యాదుదారుడికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి.మాన‌సిక వేద‌న‌కు గురైనందుకు అభిషేక్‌కు 20 వేలు, ఫిర్యాదు ఖ‌ర్చుల కోసం 10 వేలు, అనుచిత వ్యాపార విధానాల‌ను అవ‌లంబిస్తున్నందుకు అద‌నంగా ల‌క్ష న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని క‌న్జ్యూమ‌ర్ కోర్టు ఆదేశించింది.

సినిమా నిర్దేశిత స‌మ‌యాని క‌న్నా 10 నిమిషాల ముందే ఇలాంటివి ప్రదర్శించుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ… 30 రోజుల లోపు రూ.ల‌క్ష క‌న్జ్యూమ‌ర్ వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేయాల‌ని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube