సాధారణంగా కొందరు చాలా బక్కగా బలహీనంగా ఉంటారు.బరువు పెరగడం( Weight Gain ) కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.
బరువు తగ్గడం అనేది చాలా కష్టమని మనందరం భావిస్తాము.కానీ బరువు తగ్గడమే కాదు పెరగడం కూడా కష్టమే.
వయసుకు తగ్గ బరువు లేకపోవడం వల్ల ఎంతో మంది నానా ఇబ్బందులు పడుతున్నారు.వెయిట్ గెయిన్ అవ్వడం కోసం తంటాలు పడుతున్నారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) మీకు చాలా బాగా సహాయపడుతుంది.
రెగ్యులర్ గా ఈ స్మూతీని తీసుకుంటే ఆరోగ్యంగా మీరు బరువు పెరుగుతారు.అదే సమయంలో మరెన్నో ఆరోగ్య లాభాలు పొందుతారు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది జీడిపప్పులు,( Cashew ) పది బాదం గింజలు,( Almonds ) పది ఎండు ద్రాక్ష వేసుకుని వాటర్ తో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు మరియు నాలుగు ఎండు ఖర్జూరాలు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలను పాలతో సహా వేసుకోవాలి.అలాగే ఒక యాపిల్ పండు ముక్కలు( Apple ) వేసి మరి కొద్దిగా పాలు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ అనేది సిద్ధం అవుతుంది.రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ యాపిల్ నట్స్ స్మూతీని( Apple Nuts Smoothie ) తీసుకుంటే చక్కగా బరువు పెరుగుతారు.
పుష్టిగా మారతారు.బలహీనత దూరం అవుతుంది.
రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు సరిపడా శక్తి లభిస్తుంది.ఎముకలు, కండరాలు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.అలాగే ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.రక్తహీనత పరార్ అవుతుంది.
మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు చర్మం యవ్వనంగా సైతం మెరుస్తుంది.