ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.02
సూర్యాస్తమయం: సాయంత్రం 05.41
రాహుకాలం: ఉ.09.16 నుంచి 10.49 వరకు
అమృత ఘడియలు: ఉ.08.40 నుంచి 08.18 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.03 నుంచి 06.49 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే టప్పుడు ఒక సారి ఆలోచించి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలి.సానుకూల ఆలోచనతో పనిచేస్తారు.మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు.
ఎప్పటికీ ఇతరులపై నమ్మకం పెట్టకోకపోవడం మంచిది.లేకపోతే ఇబ్బందుల్లో మీరు పడే అవకాశం ఉంది.కుటుంబంలో నూతనోత్తేజం వస్తుంది.
వృషభం:

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసొస్తుంది.వ్యాపార పర్యటనలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది.అంతేకాకుండా మీ పురోగతికి మార్గం సుగమం అవుతుంది.
నూతన స్నేహితుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి సాధించడం కోసం చేసే ప్రయత్నంలో మీ ఆర్థిక పరిస్థితిని కాస్త దెబ్బతినే అవకాశం ఉంది.బయటకు వెల్లినప్పుడు మీరు ఎవ్వరినీ నమ్మడానికి వీలు లేదు.
మిథునం:

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.ఏదో ఒక విషయంపై మీ జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశాలున్నాయి.మీ పనిపట్ల శ్రద్దను పెడితే మంచి ఫలితాలను పొందవచ్చు.
లేక పోతే వైపరిత్యాలకు దారి తీస్తుంది.మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి ఏ సహాయం అందకపోవచ్చు.జీవిత అనుభవాలను అర్థం చేసుకుని ముందుకు సాగడం మీ పురోగతికి నాంది పలుకుతుంది.
కర్కాటకం:

ఈ రోజు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి.కుటుంబం పట్ల స్నేహ వైఖరిని కలిగి ఉంటారు.మీ తో పనిచేసే వారిని ప్రోత్సహించడం వల్ల మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు.
సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు.ప్రేమ విషయంలో బిజీబిజీగా గడుపుతారు.సమాజంలో మీకంటూ గౌరవం అందుకుంటారు.
సింహం:

జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడనుంది.ఈ రోజు మీకు గుర్తిండిపోయేలా గడుపుతారు.వ్యాపార విషయాల్లో విజయాన్ని అందుకుంటారు.
ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఇంటి అవసరాలను తీరుస్తారు.నిజాయితీగా పనిచేసినందుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కన్య:

మీరు పనిపట్ల మీకు నూతన అవకాశాలు వచ్చే అవకావాలున్నాయి.విజయం సాధించేందుకు మీ వంతు ప్రయత్నాలు చేస్తారు.బంధాలను వ్యక్తపరిచేందుకు సమయం మంచిది.
పాత జ్ఞాపకాలను మరిచిపోవడం మూలంగా మనస్సుకు హాయి కలుగుంది.కొన్ని పనుల వల్ల నూతన ఉత్సాహాన్ని పొందుతారు.
తులా:

ఈ రోజు మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.గతంలో ఏర్పడిన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికను పూర్తిచేసుకంటారు.రుణాలు ఇవ్వడం మానుకుంటే మంచిది.సంతానం గురించి మంచి శుభవార్తలు వింటారు.కుటుంబ సంబంధాలు గట్టిపడతాయి.వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వృశ్చికం:

ఈ రోజు మీరు చేసే పనులే భవిష్యత్తలో మీకు ఎంతో ఉపయోగపడతాయి.వ్యాపార విషయాల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురు కావొచ్చు.
ప్రేమ లో గడపటం వల్ల మీరు సంతోషంగా గడుపుతారు.మీ పట్ల నటిస్తున్న వారికి దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక పరిస్థితులు ప్రభావితమయ్యే అవకాశం కూడా పొంచి ఉంది.
ధనస్సు:

ధనస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.కుటుంబానికి సంబంధించిన ఖర్చులు పెరుగె అవకాశం ఉంది.అశుభ వార్తలు వినే అవకాశం కూడా పొంచి ఉంది.
ప్రతికూల ఆలోచనలకు దూరంగా మూలంగా సంతోషంగా ఉండగలుగుతారు.పాత స్నేహితుల కారణంగా మీ జీవితంలో ఆనందాన్ని పొందుతారు.ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
మకరం:

ఈ రోజు మీ జీవితంలో నూతన మార్పులు సంభవించే అవకాశముంది.ప్రభుత్వం నుంచి గౌరవం పొందుతారు.మీ పనితీరును మెరుగుపరుచుకుంటారు.
అత్త మామల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు.జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు.చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభం:

భవిష్యత్ గురించి ప్రణాళికలు చేసుకుంటారు.అనుక్షణం ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు.మీరు చేసే పనిలో జాగ్రత్త వహించడం మంచిది.
లేకపోతే అనుకోని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.మీ పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి.మీ మంచి పనుల మూలంగా గురువుల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు.
మీనం:

వృత్తి పరంగా అందరితో సంబంధాలు మెరుగుపడతాయి.అనుకోకుండా ధనలక్ష్మి మిమ్మల్ని చేరుకుంటుంది.స్నేహితులతో సుదూర ప్రయాణాలకు వెళ్లే అవకాశాలున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతికూల నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది.అన్ని సమస్యలను సహనంతో ఎదుర్కున్నప్పుడే మంచి ఫలితాలను పొందుతారు.
వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతారు.