భర్త వల్ల కాకుండా కుంతీ దేవికి పిల్లలెలా పుట్టారు?

పాండవుల తల్లి అయిన కుంతీ దేవికి తన భర్త పాండు రాజు వల్ల సంతానం కలగలేదు.అయినప్పటికీ పాండువులకు జన్మ ఎలా ఇచ్చిందనే విషయం కొందరకి తెలియదు.

 How Did Kunti Devi Give Birth To Children Instead Of Her Husband , Paandu Raju ,-TeluguStop.com

అంతే కాదు ఈమెకు పెళ్లికి ముందే కర్ణుడు జన్మించాడు.ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ.

అతను ఎలా జన్మించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 పాండు రాజు మొదటి భార్య కుంతీదేవి ద్వారా పాండురాజుకు సంతానం కల్గలేదు.

కుంతీ దేవి చిన్నప్పుడు దుర్వాస మహాముని తమ ఆశ్రమానికి వస్తాడు.చాలా కోపిష్టి అయిన దుర్వాస మహామునికి సంవత్సర కాలం పాటు ఎంతో భక్తి, శ్రద్ధలతో కుంతీదేవి సపర్యలు చేసింది.

ఎన్ని సార్లు ఆయన ఆమె మీద కోప్పడ్డా ఇష్టంగా సేవ చేసింది.ఆమె చేసిన సేవలకు మొచ్చిన దుర్వాస మహాముని ఆమెకు ఓ వరాన్ని ఇచ్చాడు.

ఈ వరం ప్రకారం ఆమెకు ఇష్టమైన దేవతలను ప్రార్థించగానే వారి ద్వారా ఆమెకు సంతానం కల్గుతుంది.ఆ మంత్రం నిజంగానే పని చేస్తుందా లేదా అని ఒకసారి సూర్య దేవున్ని తలచుకొని మంత్రం పఠించగానే.ఆయన ప్రత్యక్షమై కర్ణుడిని సంతానంగా ఇస్తాడు.

పెళ్లికి ముందే కొడుకు పుడితే.తన పరువు పోతుందని భావించిన కుంతీదేవి ఆయనను చెరువులో ఓ దొప్పలో వేసి వదిలేస్తుంది.ఆ తర్వాత కొన్నాళ్లకు పాండురాజుని పెళ్లి చేసుకుంటుంది.

ముందుగా యమధర్మరాజుని ప్రార్థించడంతో.యుధిష్టరుడు పుట్టాడు. ఇతనికి ధర్మరాజు అనే మరో పేరు కూడా కలదు. వాయుదేవుడి అంశతో భీముడు, చివరగా దేవేంద్రుడిని ప్రార్థించడంతో అర్జునుడు జన్మించాడు.అలాగే కుంతీ దేవి తన సవితి అయిన మాద్రీ దేవికి ఆ మంత్రం ఉపదేశించి ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని చెప్పగా.ఆమె ఒకేసారి ఇద్దరు జన్మించేలా అశ్వినీ దేవతలను ప్రార్థించి ఇద్దరు పిల్లలను పొందింది.

ఇలా పుట్టిన వాళ్లే నకుల, సహదేవులు.

How Did Kunti Devi Give Birth To Children Instead Of Her Husband , Paandu Raju , Kunti Devi , Karnudu ,yamadharma Raju , Dharma Raju , Bemudu ,arjunudu , Nakuludu , Sahadevudu - Telugu Arjunudu, Bemudu, Devotional, Dharma Raju, Karnudu, Kunthi, Kunthidevi, Kunti Devi, Nakuludu, Paandu Raju, Pandavulu, Pandu Raju, Sahadevudu, Yamadharma Raju

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube