చియా సీడ్స్( Chia Seeds ) ని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.ప్రస్తుత కాలంలో చాలా మంది చియా గింజలను తమ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉన్నారు.
అయితే మీరు ప్రతి రోజు చియా సీడ్స్ తీసుకోవడం మొదలుపెడితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.మరి ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్ ని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.చియా సీడ్స్ లో పాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.
ఈ చియా సీడ్స్ ని మన ఆహారంలో చాలా రకాలుగా భాగం చేసుకోవచ్చు.అయితే పరిగడుపున చియా సీడ్స్ నానబెట్టి వాటిని తాగడం మంచి పద్ధతి అని చెబుతున్నారు.అలా తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అత్యంత ఎక్కువగా 50% ఫైబర్ ఉంటుంది.దీనివల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
వీటిని నీటిలో నానబెట్టినప్పుడు అది ఒక జెల్లీ లాగా మారుతుంది.ఇది త్వరగా నీటిలో కరగడానికి ఉపయోగపడుతుంది.
చియా సీడ్స్ ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.డైజేషన్ నెమ్మదిగా జరుగుతుంది.దీంట్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.దాని వల్ల బరువు సులభంగా తగ్గుతారు.ఇంకా చెప్పాలంటే చియా గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు( Omega-3 Fatty Acids ), మెగ్నీషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి.
ఇవి శరీరంలోని హార్మోన్లు పనితీరును మెరుగుపరిచి రక్తపోటు( Blood pressur )ను నియంత్రిస్తాయి.ఇవి చర్మ సమస్యను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.
కాబట్టి మనం తీసుకునే ఆహారంలో చియా గింజలను చేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.