దేవాలయాలలో పూజారులు అంటేనే సాధారణంగా బ్రాహ్మణులు( Brahmins ) ఉంటారని అందరికీ తెలిసిన విషయమే.కానీ మద్రాస్ హైకోర్టు( Madras High Court ) ఇటీవల ఒక కేసు విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది.
ముఖ్యంగా పూజారులు అంటే జంధ్యం వేసిన వారు కాదు.అగమశాస్త్రం తెలిసిన వేద విద్యలు తెలిసిన ఎవరైనా దేవాలయాల్లో అర్చకులుగా ఉండవచ్చని తెలిపింది.
శ్రీకాళహస్తి( Srikalahasti ) దేవాలయంలో భక్తకన్నప్ప వారసులు అర్చకులుగా ఉంటారు.వారు గిరిజన తెగలకు చెందిన వారు.
సింహాచలం దేవాలయంలో కూడా ఇలాంటి అర్చకులు ఉన్నారు.జంధ్యం వేసుకున్న వారందరూ బ్రాహ్మణులు కాదు.
ఆంధ్రప్రదేశ్ లో చాలా దేవాలయాలలో గిరిజన తెగలకు చెందిన వారు పూజలు చేసే వారు ఉన్నారని, అలాగని ప్రతి ఒక్కరూ చేయడం కాదు.ఆగమా శాస్త్రం చదువుకొని పూజ విధానాలు తెలిసినవారు దేవాలయాలలో అర్చకులుగా చేయవచ్చని మద్రాస్ హైకోర్టు( Madras High Court ) తీర్పు వచ్చింది.అన్నీ కులాలవారు అర్చకులుగా చేయవచ్చని తెలిపింది.బ్రాహ్మణులే అర్చకత్వం చేయాలని ఏమీ లేదని వెల్లడించింది.బ్రాహ్మణులే అర్చకులుగా చేయాలని చెప్పడం సరికాదని వెల్లడించింది.దీనితో కొంతమేరకు వివాదం నెలకొనేలా ఉంది.
ముఖ్యంగా దేశంలో కులాలు, మతాల ప్రతిపాదనకు కొన్ని పనులు చేస్తూ ఉంటారు.కుల వృత్తుల ఆధారంగా జీవిస్తున్న భారత్( India ) లో ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం వల్ల సదరు కులవృత్తి చేసుకునే వారికి దెబ్బ పడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ జాతిలో అర్చకులుగా చేయడం అనేది వారు వృత్తిగా భావిస్తారు.దేవుడికి భక్తులకు అర్చకులు మధ్యవర్తిగా వ్యవహరిస్తారు.కానీ అర్చకత్వం అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చనే విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.దానికి ఖచ్చితమైన విధానాలు తీసుకురావాలి.
అర్చక వృత్తి చేపట్టే వారికి ఉండవలసిన నిబంధనలు కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.ఈ వృత్తికి పాటించాల్సిన ఆచారాలు, నియమాలు, నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే అర్చక వృత్తి చేయాలని పెడితే సరిగ్గా ఉంటుందని చాలా మంది మేధావులు అభిప్రాయపడుతున్నారు.
LATEST NEWS - TELUGU