యమునా నదీ ప్రవాహంతో ఢిల్లీకి ముప్పు లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.వర్షాలు, వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఈనెల 8, 9 తేదీల్లో 153 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు.
అయితే ఇంత వర్షాన్ని తట్టుకునే వ్యవస్థ ఢిల్లీకి లేదని చెప్పారు.యమునా నది వరదపై కేంద్రంతో టచ్ లో ఉన్నాట్లు పేర్కొన్నారు.వేలెత్తి చూపించేందుకు ఇది సమయం కాదన్న కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రవాహం 203.58 మీటర్ల దగ్గర ఉందని తెలిపారు.ఇంతకన్నా పెరగదని నిపుణులు చెప్పారన్నారు.ఒకవేళ యమునా నది ప్రవాహం 206 మీటర్లు దాటితే నదీ పరివాహక ప్రాంత ప్రజలను తరలిస్తామని వెల్లడించారు.అదేవిధంగా ఇప్పటికే జలమయం అయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.