తండ్రి అంటే రగిలిపోయే జయలలితకు కొడుకు అంటే ఎందుకు అంత ఇష్టం

తమిళనాడు రాజకీయాలు( Tamil Nadu Politics ) చాలా ఆసక్తికరంగా ఉంటాయి అక్కడ ఏ పార్టీ రెండవసారి అధికారం చేయబట్టడం జరగదు.కానీ ఆ రికార్డును బద్దలు కొట్టిన వ్యక్తి కేవలం జయలలిత మాత్రమే.

 Why Jayalalitha Likes Stalin Somuch , Tamil Nadu Politics, Jayalalitha, Karunan-TeluguStop.com

ఆమె రెండు సార్లు కరుణానిధి పై పోటీ చేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.ఇక కరుణానిధి వర్సెస్ జయలలిత గొడవలు ఏ స్థాయిలో ఉండేవో అందరికీ తెలుసు.

ఉప్పు నిప్పులా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని జైళ్ళ పాలు అయినవారే.కరుణానిధి ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే జయలలితను( Jayalalithaa ) ఏదో ఒక కేసులో అరెస్టు చేయించి జైలుకు పంపేవారు.

అదే విధంగా జయలలిత సైతం అధికారంలోకి రాగానే కరుణానిధి అంతు తెల్చేది.ఇలా ఒకరిపై ఒకరు పీకల్లోతు కోపంతో ఎప్పుడు రగిలిపోతూనే ఉండేవారు.

Telugu Jayalalitha, Karunanidhi, Rajithammal, Stalin, Tamil Nadu-Telugu Stop Exc

ఇక కరుణానిధి( Karunanidhi ) జయలలిత గొడవలు ఏ స్థాయిలో ఉండేవంటే అసెంబ్లీ సాక్షిగా జయలలిత పై దుశ్శాసన పర్వం జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే.అలాగే జయలలిత అధికారంలో ఉన్నప్పుడు కరుణానిధిని వీల్ చైర్ లోంచి లాగి మరీ మెట్ల పైనుంచి ఈడ్చికొచ్చి తీసుకెళ్లి రాత్రికి రాత్రి జైల్లో పడవేసిన సంగతి కూడా తెలిసింది.ఇలా వీరి గొడవలు ఎల్లప్పుడూ తారాస్థాయిలోనే ఉండేది.కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కరుణానిధి కుటుంబం నుంచి జయ లలితకు అభిమానులు ఉన్నారని, అలాగే ఆవిడ చనిపోయేంత వరకు కూడా ఆ కుటుంబంలోని కొందరితో టచ్ లోనే ఉండేది.

Telugu Jayalalitha, Karunanidhi, Rajithammal, Stalin, Tamil Nadu-Telugu Stop Exc

కరుణానిధి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సమయంలో అతని రెండవ భార్య రజితమ్మాల్( Rajithammal ) కి జయలలిత అంటే ఎంతో ఇష్టం ఉండేది.జయలలితకు ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే ఆవిడ ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడేవారు.అలాగే ఆవిడ ఎల్లప్పుడూ స్టాలిన్ చాలా మంచి వాడని, సున్నిత స్వభావుడని, నెమ్మదస్తుడని, బాగా ఆలోచిస్తాడంటూ కూడా జయలలితకు చెప్పేవారట రజితమ్మాల్.దాంతో స్టాలిన్ ( Stalin )పై ఆమె అభిమానం పెంచుకున్నారు.

ఈ రజితమ్మాల్ మరెవరో కాదు కనిమొలి తల్లి.దాంతో స్టాలిన్ కూడా జయలలిత పై అభిమానాన్ని చూపించేవారు.

ఆవిడ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వెళ్లి ఆమెను పరామర్శించవచ్చారు.అలాగే రజితమ్మాల్ సైతం ఆవిడ చావు బ్రతుకుల్లో ఉన్న చివరి రోజుల్లో వెళ్లి హాస్పిటల్ లో చూసి వచ్చారు.

ఇలా కరుణానిధికి జయలలితకు పడకపోయినా వారి కుటుంబంతో జయలలిత ఎల్లప్పుడూ ఎంతో బాగా ఉండేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube