జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.మహిళల అదృశ్యంపై జనసేనాని వ్యాఖ్యలపై నోటీసులు అందించిందని సమాచారం.
ఈ నేపథ్యంలో మహిళల అదృశ్యంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ లేఖ రాసింది.పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆరోపణలు చేయడం కాదన్న మహిళా కమిషన్ ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు.
పవన్ కు చెప్పిన కేంద్రం నిఘా సంస్థలోని వారు ఎవరని ప్రశ్నించారు.మహిళల అదృశ్యంలో వాలంటీర్ల పాత్ర ఏంటో ఆధారాలు చూపాలన్నారు.
పవన్ తక్షణమే లెక్కలు చూపించాలన్నారు.లేని పక్షంలో మహిళలు, వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.