విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) సంక్రాంతి వస్తున్నాం ( Sankranthiki Vastunnam ) అనే సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలకృష్ణ ( Balakrishna ) అన్ స్టాపబుల్ ( Unstoppable Show ) టాక్ షో కి హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన పలు విషయాలను కూడా వెల్లడించారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు ( Mahesh Babu ) పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి కూడా వెంకటేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వెంకటేష్ మల్టీ స్టార్ సినిమాగా మహేష్ బాబుతో అలాగే పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేసిన సంగతి తెలిసిందే.మహేష్ కాంబినేషన్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.ఇక పవన్ కళ్యాణ్ తో ఈయన గోపాల గోపాల సినిమాలో( Gopala Gopala Movie ) నటించిన విషయం తెలిసిందే.
టాక్ షోలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టులో వెంకటేష్.మహేష్ బాబుని పూలకుండీ ఎందుకు తన్నావురా .? అనే సీన్ ప్లే చేశారు.ఈ సీన్ గురించి బాలకృష్ణ ప్రశ్న వేయడంతో గత కొద్ది రోజుల క్రితమే ఇదే విషయం గురించి మహేష్ బాబుకి మెసేజ్ చేస్తే నాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని నవ్వుతూ చెప్పారు.
మహేష్ బాబుతో కలిసి ఈ సినిమా సమయంలో నేను చాలా దగ్గరయ్యాను.మహేష్ నా చిన్న తమ్ముడు అందరికీ ఎంతో గౌరవం ఇస్తారు.ఇప్పుడు కూడా ఎక్కడ కలిసిన నాకు నా చిన్న తమ్ముడు అనే ఫీలింగే వస్తుందని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ సినిమాలలోకి రాకముందే నాకు తెలుసు.
అయితే పవన్ సినిమాలలోకి రాకముందు ఎక్కువగా మా ఇంటికి వచ్చేవాడు.నా దగ్గర లేజర్ డిస్క్ లు ఉండేవి వాటి కోసం ఎక్కువగా వచ్చే వాడు.
ఇద్దరం సైలెంట్ గా ఉంటాం.అలాగే ఇద్దరికీ భక్తి భావం ఎక్కువ.
మేమిద్దరం భక్తి భావంతోనే దగ్గర అయ్యాం అంటూ ఈ సందర్భంగా వెంకటేష్, పవన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.