ఆచార్య చాణక్యుడి( Chanakya ) సూత్రాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి.మంచి సురక్షితమైన జీవితాన్ని గడపడానికి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయాలను వెల్లడించాడు.
నిద్ర నుంచి ఇలాంటి వారిని మేల్కొల్పకూడదని చాణక్య నీతిలో ఉంది.వీరిని నిద్ర లేపితే మనకే ప్రమాదం అని అందులో ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు అసంపూర్ణ నిద్ర నుంచి మేలుకుంటే వారి మానసిక స్థితి( Mental Health ) చెదిరిపోతుంది.వారు రోజంతా ఏడ్చే అవకాశం ఉంది.
సగం నిద్ర కారణంగా హైపర్ ఆక్టివ్( Hyperactive ) గా ఉన్న పిల్లలను హ్యాండిల్ చేయడం ఎంతో కష్టం.వారిని ఎప్పుడూ సగం నిద్ర నుంచి మేల్కొల్పకూడదు.

ఆరోగ్య కారణాల వల్ల ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు.అలాగే ప్రమాదకరమైన జంతువు నిద్రిస్తున్నప్పుడు మేల్కొల్పడానికి అసలు ప్రయత్నించకూడదు.ఒక ప్రమాదకరమైన జంతువు కోపంతో ఒకరి పై దాడి చేయవచ్చు.తద్వారా మీ ప్రాణాలకు హాని కలుగుతుంది.కుక్క ను నిద్ర నుంచి లేపడం కూడా మిమ్మల్ని ఇబ్బంది లోకి నెట్టవచ్చు.అందుకోసం వాటి నిద్రకు భంగం కలిగించకూడదు.
ఎందుకంటే అవి మీకు హాని కలిగిస్తాయి.అలాగే నిద్రపోతున్న సింహాన్ని లేపడం పెద్ద తప్పు.
ఈ తప్పు ఎప్పుడూ చేయకూడదు.అలాగే ఆచార్య చాణక్యుడి నీతి( Chanakya Niti ) ప్రకారం మూర్ఖుడిని నిద్ర నుంచి మేల్కొల్పడం ఇబ్బందులను ఆహ్వానించడం ఒకటే అని చెప్పవచ్చు.

మూర్ఖుడికి పరిస్థితిని వివరించడం చెవిటి వాడి ముందు వీణ వాయించినట్లే అని చాణక్య నితి లో ఉంది.ఒక మూర్ఖుడి ప్రయోజనం కోసం మీరు అతనిని నిద్ర నుంచి లేపితే అతను మిమ్మల్ని తప్పుగా భావిస్తాడు.ఇంకా చెప్పాలంటే పురాతన కాలంలో రాజును నిద్ర నుంచి లేపడం నేరంగా భావించేవారు.నేటి సమాజంలో ఒక గొప్ప అధికారి లేదా పాలకుడు నిద్ర నుంచి మేలుకుంటే అతని ఆగ్రహానికి గురవుతారు.
రాజులను నిద్ర నుంచి లేపకూడదని చాణిక్య నీతిలో ఉంది.