న్యూస్ రౌండప్ టాప్ 20

1.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
 
2.ఇకపై ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్

  ఇకపై ప్రతియేటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో వెల్లడించారు.
 
3.చంద్రబాబు ప్రాణాలకు ముప్పు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
 
4.మంత్రి హత్యకు కుట్ర కేసులో విచారణ

  తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు విచారణ వేగవంతం అయ్యింది.ఏడుగురు నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు.
 
5.సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు మృతి

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని సింగరేణి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులు బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
 
6.ఎల్ఐ సి ఐపివో కి సెబీ గ్రీన్ సిగ్నల్

  ఎల్ఐసి ఐపిఓ కి మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ ఆమోదం లభించింది.
 
7.తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ లు

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

తెలంగాణలో ఖాళీగా ఉన్న 91,142 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
 
8.ఉన్నత విద్య పై అంతర్జాతీయ సదస్సు

  ఉన్నత విద్య, కోవిడ్ అనంతరం నూతన కోణం – అంతర్జాతీయ దృక్పథం అనే అంశంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి తెలిపారు.
 
9.తెలంగాణ అసెంబ్లీ

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

అసెంబ్లీలో ఈ రోజు క్వశ్చన్ అవర్ ను రద్దు చేశారు.
 
10.కాకినాడ జేఎన్టీయూ స్నాతకోత్సవం

  కాకినాడ జేఎన్టీయూ ఎనిమిదవ స్నాతకోత్సవం జరగనుంది ఈ కార్యక్రమానికి ఆన్లైన్ ద్వారా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొననున్నారు.
 
11.బిజెపి మహాధర్నా

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

మిర్చి రైతుల సమస్యలు వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుంటూరు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరుకానున్నారు.
 
12.ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు

  ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
 
13.తిరుమల సమాచారం

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారిని 58,561 మంది భక్తులు దర్శించుకున్నారు.
 
14.యాదాద్రి ఆలయానికి కోటి విరాళం

  తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి శాంతా బయోటెక్ పౌండర్ కొండూరు వరప్రసాద్ రెడ్డి ఒక కోటి 8 లక్షల విరాళాన్ని ఆలయానికి విరాళంగా అందించారు.
 
15.మెట్రోకు ఫిక్కీ అవార్డు

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అవార్డును ఎల్ అండ్ టి , హైదరాబాద్ మెట్రో రైలు అందుకుంది.
 
16.103 ఏళ్ల వృద్ధురాలికి జీవిత కాలం ఉచిత బస్ పాస్

  నాగర్ కర్నూలు జిల్లా ఉప్పు నుంతల మండలం లక్షమాపూర్ గ్రామానికి చెందిన 103 రాములమ్మ అనే వృద్ధురాలు 40 ఏళ్లుగా  ఆర్టీసీ లోనే ప్రయాణిస్తూ ఉండడంతో ఆమె వివరాలు తెలుసుకున్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆమెకు జీవిత కాలం పాటు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు.
 
17.నేడు బడ్జెట్ పై సాధారణ చర్చ

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై శాసన సభ లో బుదవారం సాధారణ చర్చ జరగనుంది.
 
18.ఎమ్మెల్యే ల సస్పెన్షన్ పై బీజేపీ ఆందోళన

  తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే లను అసెంబ్లీ లో సస్పెన్షన్ చేయడం పై బిజెపి ఆందోళన చేపట్టింది.
 
19.తెలంగాణ ప్రభుత్వం పై అక్బరుద్దీన్ విమర్శలు

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Kakinada Jntu, Telangana, Telangana Jo

తెలంగాణ ప్రభుత్వం పై అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర సయిలో మండిపడ్డారు.మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఈ మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
 
20.ఈరోజు బంగారం ధరలు

  22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,700
  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,310

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube