వారానికి ఒకసారి టీ పొడితో ఇలా చేస్తే ఇకపై ఒక్క వెంట్రుక కూడా రాలదు!

హెయిర్ ఫాల్( Hairfall ).దాదాపు అందర్నీ అత్యంత కామన్ గా వేధించే సమస్య ఇది.

 How To Stop Hair Fall With Tea Powder?, Hair Fall, Stop Hair Fall, Hair Care, Ha-TeluguStop.com

అయితే కొందరిలో హెయిర్ ఫాల్ అనేది కాస్త తక్కువగా ఉంటే కొందరిలో మాత్రం చాలా అధికంగా ఉంటుంది.ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి విసిగిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.టీ పొడి( Tea Powder )తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే ఇకపై ఒక్క వెంట్రుక కూడా రాల‌దు.మరి ఇంకెందుకు ఆలస్యం టీ పొడితో జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Fall, Long, Tea Powder, Thick-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పులు బియ్యం కడిగిన వాటర్ ను పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు టీ పొడి వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ తులసి ఆకులు మరియు వన్ టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరికాయ ముక్కలు( Amla ) వేసి ఉడికించాలి.దాదాపు ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు బాయిల్ చేసిన అనంతరం స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆపై స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకొని బాగా మిక్స్ చేయాలి.

తద్వారా మంచి టోనర్ సిద్ధమవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండు సార్లు టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Care, Care Tips, Fall, Long, Tea Powder, Thick-Telugu Health

వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.కుదుళ్ళు బలోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట పడుతుంది.

కాబట్టి జుట్టు రాలడాన్ని అడ్డుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.పైగా ఈ హోమ్ మేడ్ టోనర్( Homemade hair toner ) ను వారానికి ఒకసారి వాడటం వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది.

తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.కురులు ఒత్తుగా సైతం పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube