Nandyal District : బనగానపల్లెలో వింత ఘటన ....వేప చెట్టు కు అమ్మవారి ఆకారం

జమ్మలమ్మ తల్లి దర్శనం ఇచ్చిందని నమ్ముతున్న భక్తులు.పసుపు కుంకుమలు రాసి ఆభరణాల అలంకరించి పూజలు చేసిన స్థానికులు.

 A Strange Incident In Banaganapalle Neem Tree In The Shape Goddess , Neem Tree-TeluguStop.com

వేప చెట్టు పైభాగాన్ని ఇటీవలే కొద్ది నెలల క్రితం రంపం తో కోత.నంద్యాల జిల్లా బనగానపల్లె , తెలుగు పేట లోని పాత బావి వద్ద ఉన్న వేప చెట్టుకు వింత ఘటన చోటుచేసుకుంది.చెట్టు మొదలు బాగం లో అమ్మవారి రూపం తో ఆకారం ఏర్పడి కనిపించడంతో , స్థానికుల్లో భయంతో పాటు భక్తి భావం కూడా ఏర్పడింది.

తెలుగు పేట కాలనీవాసులు ఇంటి ఇలవేల్పు అమ్మగా భావించి పూజించే సాక్షాత్తు జమ్ములమ్మ తల్లి వేప చెట్టుపై దర్శనం ఇచ్చిందంటూ.

అమ్మవారి రూపం ఆకారం ఏర్పడిన చోట , భక్తిశ్రద్ధలతో పసుపు కుంకుమలు రాసి , ఆభరణాలు అలంకరించి , ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేపచెట్టు పై అమ్మవారి ఆకారం ఏర్పడిన వింత ఘటన సమాచారం పట్టణం లోని వివిధ కాలనీవాసులకు తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి, నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుకున్నారు.

వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడి హాట్ టాపిక్ గా మారిన ఈ వేప చెట్టు ను గత కొద్ది నెలల క్రితం చెట్టు పైభాగాన్ని రంపం యంత్రంతో కోసివేసి చెట్టును పైభాగం అంతా కోసి వేసి తొలగించడం జరిగింది.చెట్టును కోసి వేయడం వల్లే అమ్మవారు ఆగ్రహించి , వేప చెట్టుపై అమ్మవారు దర్శనమిచ్చారనే ప్రచారం జరుగుతుంది.

వేప చెట్టుపై అమ్మవారి ఆకారం ఏర్పడిన ఘటన చెట్లను నరికి వేయొద్దని సందేశాన్ని అమ్మవారు స్పష్టంగా తెలియజేసారని భక్తులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube