ఇటీవల రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎందరి పాలిటో అధిక బరువు సమస్య పెద్ద శాపంగా మారింది.జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజస్, గంటలు తరబడి ఒకే చోట కూర్చోవడం, పలు రకాల మందుల వాడటం.
ఇలా ఎన్నో బరువును ప్రభావితం చేస్తాయి.ఇక కారణం ఏదైనప్పటికీ అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే మాత్రం.
మధుమేహం, గుండె జబ్బులు, సంతాన లేమి తదితర సమస్యలు చుట్టేస్తాయి.ఈ కారణంగానే చాలా మంది వెయిట్ లాస్ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తారు.
అయితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి కొన్ని కొన్ని ఆయిల్స్ అద్భుతంగా సహాయపడతాయి.అవేంటో.? వాటిని ఎలా వాడాలో.? ఇప్పుడు తెలుసుకుందాం.గ్రేప్ ఆయిల్.వెయిట్ లాస్‌కి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపున ఒక గ్లాస్ వాటర్‌లో రెండు లేదా మూడు చుక్కలు గ్రేప్ ఆయిల్ మిక్స్ చేసి సేవించాలి.తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వంతా కరిగిపోతుంటాయి.

అలాగే ఏలకుల నూనె ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ.బరువును తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.వంటల్లో మూడు, నాలుగు చుక్కల ఏలకుల నూనె వేసి వండుకుని తినండి.తద్వారా బరువు వేగంగా తగ్గుతారు.మరియు ఏవైనా మూత్ర సంబంధిత సమస్యలున్నా తగ్గుతాయి.

లెమన్ ఆయిల్ కూడా అధిక బరువు సమస్య నుంచి త్వరగా విముక్తి కలిగించగలదు.ఒక గ్లాసు నీటిలో రెండు చుక్కల లెమన్ ఆయిల్ కలిపి ఉదయాన్నే సేవించాలి.ఇలా ప్రతి రోజూ చేస్తే అతి ఆకలి తగ్గుతుంది.
శరీరం శక్తి వంతంగా మారుతుంది.ఓవర్ ఫ్యాట్ కరిగి పోతుంది.
ఫలితంగా మీరు నాజూగ్గా మారతారు.
ఇక మెంతి నూనెతోనూ వెయిట్ లాస్ అవ్వొచ్చు.
మూడు స్పూన్ల కొబ్బరి నూనెలో పావు స్పూన్ మెంతి నూనె కలిపి.పొట్ట, తొడలు, నడుము ఇలా కొవ్వు ఎక్కడైతే ఎక్కువగా పేరుకుందో అక్కడ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి.
ఆపై స్నానం చేయాలి.ఇలా చేయడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది.





 

