భారత దేశ హిందువులు ఎక్కువ పూజించే దేవుళ్లలో శివుడు ముందు వరుసలో ఉంటాడు అనేది అక్షరాలా నిజం.అయితే శివరాత్రి సమయంలో ఎంతో మంది భక్తులు 12 జ్యోతిర్లింగాల తో పాటుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకొని వస్తారు శివరాత్రి రోజు ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు.
వారణాసి, కేదారినాథ్, శ్రీశైలం, రామేశ్వరం ఇలా ఎక్కడ చూసినా సరే శివుడు భక్తులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు.ఇది అంత సరే.నవరాత్రి అయిపోయింది కదా! ఇప్పుడు ఎందుకు శివరాత్రి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.మొన్న శివరాత్రి సందర్భంగా ఎన్నో సంవత్సరాల క్రితం ఫోటో భయటకు వచ్చింది.
అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగానే శివ భక్తులు శివుడి గురించి ఏ వార్త వచ్చిన ఎంతో ఆసక్తిగా చదువుతారు.మీడియా కూడా అంతే.శివుడి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర ఫోటో బయటకు వచ్చింది.అది ఇప్పటి శివలింగం కాదు.
ఎన్నో ఏళ్ళ కిందటి శివలింగం అది.
ఆ శివలింగానికి ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర ఉంది.ఎం.వాట్స్ అనే పురావస్తు శాస్త్రవేత్త 5 వేల సంవత్సరాలకుపైగా వయసు ఉన్న మూడు శివలింగాలను హరప్ప వద్ద కనుక్కున్నారు.ఈ అరుదైన ఆర్కైవల్ ఫోటో హరప్ప సైట్ లో తీసినట్టు తెలుస్తుంది.ఈ ఫోటోను చుసిన శివభక్తులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.