మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజూ స్నానం చేసి.సూర్య నమస్కారాలు చేస్తుంటాం.
అయితే ఆ తర్వాతే పూజ చేస్కుంటాం.స్నానం చేయకుండా కనీసం దేవుడిని కూడా తాకము.
అయితే నీరు ఒంటి మీద పోస్కొని చేస్తేనే స్నానం అంటారా.అలా అయితే చాలా మంది స్నానాలు చేయరు.
ముఖ్యంగా అఘోరాలు ఒళ్లంతా బూడిద రాస్కొని ఉంటుంటారు.బూడిద స్వడమే వారికి స్నానం చేసినట్లుగా కూడా భావిస్తుంటారని చెబుతుంటారు.
అయితే నిజంగానే నీరు లేకుండా స్నానం చేయొచ్చా.అసలు అది ఉంటుందా.
ఒకవేళ నీరు లేకుండా చేస్తే అది స్నానమే అవుతుందా అనే అనుమానం చాలా మందికి వస్తుంటుంది.అవును అది నిజమేనని చెబుతున్నాయి మన పురాణాలు.
అయితే అంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక నీరు లేకుండా చేసే స్నానాలు మొత్తం 7 రకాలు.
అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మంత్ర స్నానం.
మంత్రాలతో దేహాన్ని ఆవహించేలా చేసుకోవడమే మంత్ర స్నానం.రెండోది భౌమ స్నానం.
దేహానికి విభూది రాసుకోవడాన్నే భౌమ స్నానం అంటారు.అలాగే మూడోది ఆగ్నేయ స్నానం.
మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ విభూది రాసుకోవడమే ఆగ్నేయ స్నానం.నాలుగోది వాయు స్నానం.
ఆవు డెక్కల వల్ల ఏర్పడిని మట్టిని శరీరానికి పూసుకోవడానే వాయు స్నానం అంటారు.ఐదోది దివ్య స్నానం.
ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో ఎండలో నిలబడి ఉండటాన్నే దివ్య స్నానం అంటారు.ఆరోది మానసిక స్నానం.
తడి వస్త్రాలతో శరీరాన్ని తుడుచుకోవడాన్నే మానసిక స్నానం అంటారు.చివరిది, ఏడవది ధ్యాన స్నానం.
తులసి చెట్టులోని జలాన్ని చట్టుకోవడాన్నే ధ్యాన స్నానం అంటారు.