మన భారత దేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి పురావస్తు సంపద ఇప్పటివరకు మన రాష్ట్రాలలో అలాగే చెక్కుచెదరకుండా ఉంది.అలాంటి వాటిలో ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ మన దేశంలో ఇప్పటికీ అలాగే ఉంది.
ఇలాంటివే కొన్ని పురామస్తు శిల్పాలు కూడా మన దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటి వరకు కూడా దేశ విదేశాల నుంచి ఎంతోమంది సందర్శకులు వచ్చి వీటిని దర్శించుకుని వెళుతూనే ఉంటారు.
జంగల్పట్టు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన మహాబలిపురంలో సముద్రపు గాలుల ప్రభావితంతో ప్రాచీన శిల్ప సంపద దెబ్బతినకుండా తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు రసాయన మిశ్రమం కలిపిన నీటితో ఈ ప్రాచీన శిల్ప సంపదను శుభ్రపరచినట్లు ఏర్పాట్లను చేశారు.
మహాబలిపురం సముద్ర తీరా ప్రాంతంలో పల్లవ రాజులు, పంచ రధాలు భారీ వెన్న ముద్దరాయి, అర్జున తపస్సు, మండపం, దేవాలయం గణేశా రథం లాంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలను నిర్మించారు.
ఈ శిల్ప సంపదను చూసేందుకు ప్రతి ఏడాది మన దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి భారీ ఎత్తున వస్తూ ఉంటారు.ప్రాచీన సంపదగా 1984లో గుర్తింపు పొందిన గణేశ రథం సముద్రపు గాలుల కారణంగా కళ విహినంగా మారిపోయింది.ఏడో శతాబ్దంలో మొదటి మహేంద్ర వర్మ పల్లవ రాజకుమారుడు నరసింహ పల్ల హయాంలో రూపుదిద్దుకున్న ఈ రథంలో భారీ వినాయకుడి విగ్రహం కూడా సందర్శకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో సముద్రపు గాలుల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు పురామస్తు శాఖ అధికారులు గణేశా రథనికి రసాయనిక తాపడం పనులు చేపట్టినట్లు పురావస్తు శాఖ అధికారికంగా ప్రకటించింది.
DEVOTIONAL