Telangana Bjp : లోక్‎సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఫోకస్..!

త్వరలో లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది.

 Bjp Focus On Selection Of Lok Sabha Candidates-TeluguStop.com

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.సుమారు 120 మంది లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ( BJP ) తీవ్ర కసరత్తు చేయనుంది.

పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ఖరారు, ప్రకటనపై కూడా నేతలు చర్చించనున్నారు.ఈ క్రమంలోనే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.అలాగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు.ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

తొలి జాబితాలోనే తెలంగాణ నేతల పేర్లు ఉండేలా కసరత్తు చేస్తుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube