1.విద్యాశాఖ ఉన్నతాధికారులతో డిఏవి స్కూల్ మేనేజ్మెంట్ భేటీ
విద్యాశాఖ ఉన్నతాధికారులతో డిఏవి స్కూల్ మేనేజ్మెంట్ భేటీ అయింది.ఎల్ కే జి విద్యార్థి పై జరిగిన లైంగిక దాడి పై స్కూల్ యాజమాన్యం సొంత కమిటీతో విచారణ జరిపించుకుంది.స్కూల్ గుర్తింపు రద్దు పై ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులను డిఏవి స్కూల్ మేనేజ్మెంట్ కోరింది.
2.తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో హై అలర్ట్
తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.
నిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన జాడి బసంత్ అనే వ్యక్తిని ఇన్ఫార్మర్ నెపం తో మావోయిస్టులు హత్య చేశారు.దీంతో ములుగు తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది.
3.కెసిఆర్ బహిరంగ సభ
ఈనెల 30వ తేదీన మునుగోడు నియోజకవర్గంలోని చుండూరులో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
4.ఆరు భద్రత ఫీచర్లతో కొత్త ఓటర్ కార్డు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు కొత్త భద్రత ఫీచర్లతో ఓటర్ ఐడి కార్డును విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
5.కోమటిరెడ్డి బ్రదర్స్ మోసగాళ్లు
కోమటిరెడ్డి బ్రదర్స్ మోసగాళ్లు అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
6.ఎమ్మెల్సీ కవిత దాతృత్వం
దీపావళి వేడుకల్లో బాణసంచా కాలుస్తూ గాయాల పాలై సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థిక సహాయం చేశారు.
7.ఎల్ఐసి ఉద్యమానికి టిఆర్ఎస్ మద్దతు
జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ని ప్రైవేటు పరం చేస్తూ.కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆ సంస్థ అధికారులు ఉద్యోగులు చేపట్టిన ఉద్యమానికి టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
8.నవంబర్ డిసెంబరులో 100 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల డిమాండ్ మేరకు నవంబర్ డిసెంబర్ నెలలో ముఖ్యమైన ప్రాంతాల నుంచి 100 ప్రత్యేక రైలు నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
9.కొడాలి నాని కి నోటీసు ఇవ్వాలి
కేసినోలు నిర్వహించి ఆడబిడ్డలతో అర్ధమగ్న ప్రదర్శనలు ఇప్పించిన మాజీ మంత్రి కొడాలి నాని కి నోటీసులు ఇవ్వాలని టిడిపి నేత వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.
10.పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సోము వీర్రాజు కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం పై తాము స్పందించమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర రాజు క్లారిటీ ఇచ్చారు.
11.నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్
నాగోల్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర పుర పరిపాలక శాఖ, పట్టణ అభివృద్ధి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
12.29న తిరుపతిలో ఆత్మగౌరవ ప్రదర్శన
ఈనెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహాప్రదర్శనకు వైసిపి సిద్ధమైంది .ఈ విషయాన్ని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
13.భద్రాద్రి రాముడు ఆస్తులు కాపాడండి
భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా నుంచి కాపాడాలంటూ ఏపీ సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.
14.పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
బీహార్ లోని గయా జిల్లాలోని గొప్ప రైల్వే స్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.రైలుకు చెందిన 53 వేగన్లు బోల్తా పడ్డాయి.
15.బిజెపికి రాపోలు రాజీనామా
బిజెపికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా చేశారు ఈ మేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు.
16.టీటీడీ భక్తులకు శుభవార్త
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది నవంబర్ నెల కోట టికెట్లను టిటిడి ఈరోజు విడుదల చేయనుంది.
17.విశాఖపట్నం పర్యటనకు నరేంద్ర మోది
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు.వచ్చే నెలలో ఆయన విశాఖలో పర్యటించనున్నారు.
18.నేడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న మల్లికార్జున ఖర్గే
ఏఐసిసి అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే నేడు ఆ బాధ్యతలను స్వీకరించినన్నారు.
19.నేడు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ
నేడు హైదరాబాద్ కు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ రానున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -47,000 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,280
.