పీడీ యాక్ట్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అప్పీల్ తిరస్కరణకు గురైంది.పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు సమర్థించింది.
ఈ క్రమంలో రాజాసింగ్ అప్పీల్ ను అడ్వైజరీ కమిటీ తిరస్కరించింది.కాగా ఎల్లుండి తెలంగాణ హైకోర్టులో పీడీ యాక్ట్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
ఇప్పటికే దీనిపై హైకోర్టులో రాజాసింగ్ భార్య పిల్ వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈనెల 28న పీడీ యాక్ట్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది.
అయితే, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పీడీ యాక్ట్ కింద కేసు నమోదె చేసారు.అనంతరం ఆగస్ట్ 25న రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.







