వర్క్ స్ట్రెస్, ఆహారపు అలవాట్లు, ధూమపానం మద్యపానం వంటి చెడు వ్యసనాలు, పోషకాలు కొరత, రేడియేషన్ తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో చాలా మంది పురుషులకు జుట్టు( Men’s Hair ) పల్చబడిపోతుంది.దాంతో మరింత ఒత్తిడికి లోనవుతుంటారు.
అందులోనూ పెళ్లి కాని అబ్బాయిలైతే మరింత వర్రీ అవుతుంటారు.కానీ వర్రీ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మోస్ట్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే పల్చటి జుట్టు( Thin Hair ) కొద్దిరోజుల్లోనే దట్టంగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఉల్లిపాయను( Onion ) తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో స్కాల్ప్ కి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ దట్టంగా పెరుగుతుంది.ఉల్లి, ఆముదం, ఆవనూనె తల చర్మంలోని రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.
కొత్త జుట్టు మొలిచేలా ప్రేరేపిస్తాయి.పల్చటి జుట్టును కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుస్తాయి.

అంతేకాకుండా ఉల్లిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.ఇవి స్కాల్ప్ ను శుభ్రంగా ఉంచుతాయి.కాలుష్యం, బాక్టీరియా వల్ల కలిగే సమస్యలను తగ్గిస్తాయి.చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.ఇక ఆవ నూనె, ఆముదం డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తాయి.హెయిర్ డ్యామేజ్ ను అరికడతాయి.