Hair Fall And White Hair: హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్‌ల‌కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ మీకోసం!

హెయిర్ ఫాల్, వైట్ హెయిర్. స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరినీ సర్వసాధారణంగా వేధించే జుట్టు సంబంధిత సమస్యలు ఇవి.

 An Effective Remedy To Check Hair Fall And White Hair Is For You Details! Effect-TeluguStop.com

వీటి నుంచి బయట పడేందుకు చాలా మంది వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.జుట్టుపై ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.

అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా మరియు వేగంగా హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఎఫెక్టివ్‌ రెమిడీ ఒకటి ఉంది.

ఆ రెమెడీ ఏంటి అన్నది ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ బ్లాక్ టీ పౌడర్ వేసుకోవాలి.

రెండు నిమిషాల పాటు మ‌రిగిన త‌ర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి, గుప్పెడు ఉల్లిపాయ తొక్కలు వేసి పది నుంచి ప‌ది నిమిషాల పాటు చిన్న మంట‌పై హీట్ చేయాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను స్ట్రైన‌ర్ స‌హాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు తయారు చేసుకున్న వాటర్ ను స్ప్రే చేసుకుని రెండు గంటల పాటు వదిలేయాలి.

అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు క‌నుక ఈ రెమెడీని ప్రయత్నిస్తే జుట్టు రాలడం క్ర‌మంగా కంట్రోల్ అవుతుంది.

వైట్ హెయిర్ సైతం సహజంగానే బ్లాక్ గా మారుతుంది.అంతేకాదు ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల కురులు సూపర్ షైనీగా మెరుస్తాయి.

Best Home Remedy for Hair fall and White Hair

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube