సాధారణంగా హీరోహీరోయిన్లపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.హీరో హీరోయిన్లు కలిసి రెండు మూడు సినిమాల్లో వరుసగా కలిసి నటించారు అంటే చాలు వాళ్ళిద్దరి మధ్యప్రేమ బంధం ఉందని లేదా ఇంకేదో బంధం నడుస్తుందనీ వార్తలను వైరల్గా మారుస్తూ ఉంటారు.
లేదా ఒక సినిమాలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటే ఇక మీడియాలో వచ్చే వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అలాగే అప్పట్లో హీరోగా ధనుష్ హీరోయిన్ శృతిహాసన్ కు మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ కలిసి త్రీ అనే సినిమాలో కలిసి నటించారు.ఇక వీరిద్దరి మధ్య కాస్త కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.దీంతో వీరి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ ఒక తమిళ పత్రిక ఆర్టికల్ రాసింది.కానీ ఆ తర్వాత మాత్రం క్షమాపణలు చెప్పడం గమనార్హం.2012 లో ఈ ఘటన జరిగింది.అయితే ఇలాంటి వార్తలపై శృతిహాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
రజినీకాంత్ కుటుంబంతో కమల్ హాసన్ సన్నిహిత స్నేహితులు.అలాంటి కుటుంబం అల్లుడు తో తాను రిలేషన్ షిప్ లో ఉన్నా అని రాయడం ఏంటి అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతటితో ఆగకుండా ఏకంగా కేసు కూడా పెట్టడం గమనార్హం.ఇక ఆర్టికల్ రాసిన మీడియాకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించింది.దీంతో దిగివచ్చిన ఆ తమిళ పత్రిక స్టోరీ ప్రచురించినందుకు గానూ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలియజేస్తూ తప్పును ఒప్పుకొంది.ఈ క్రమంలోనే స్పందించిన శృతి హసన్ ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది.
నా మీద ఆర్టికల్ రాసినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు.అందుకే ఇప్పుడు వార్తాపత్రిక క్షమాపణలు చెప్పింది అంటూ శృతిహాసన్ తెలిపింది.