రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే మలబద్ధకం దెబ్బకు పరార్ అవుతుంది!

చాలా మంది బయటకు చెప్పుకోలేని సమస్యల్లో మలబద్ధకం ఒకటి.వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు.

 This Is The Best Drink To Get Rid Of Constipation! Constipation, Constipation Re-TeluguStop.com

ఫైబర్ కొరత, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల మలబద్ధకం సమస్య( Constipation ) ఇబ్బంది పెడుతుంది.ఇది చిన్నదే అయినా దీని కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.

మలబద్ధకం ని నిర్లక్ష్యం చేస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే కొందరు ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకం దెబ్బకు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసు వాటర్( galss water ) పోయాలి.వాటర్ హీట్‌ అవ్వగానే అందులో నాలుగు లవంగాలు( cloves ), రెండు మిరియాలు( Pepper ), రెండు యాలకులు, ఎనిమిది నుంచి పది ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి.

Telugu Tips, Latest-Telugu Health

వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కనుక తీసుకుంటే మలబద్ధకం సమస్య సహజంగానే దూరం అవుతుంది.రెగ్యులర్ గా ఈ డ్రింక్ తాగితే అసలు మలబద్ధకం అన్న మాటే అనరు.

Telugu Tips, Latest-Telugu Health

పైగా ఈ డ్రింక్ వల్ల జీర్ణవ్యవస్థ( digestive system ) చురుగ్గా మారుతుంది.బాడీ డిటాక్స్ అవుతుంది.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

మ‌రియు ఈ డ్రింక్ ను తాగితే మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ సైతం కంట్రోల్ లో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube