హైబీపి చాలా కామన్ గా మనం చూసే సమస్యే.మన ఇంట్లో తాతయ్య, బామ్మలకు ఉండే ప్రధాన సమస్యల్లో ఇది కూడా ఉండే అవకాశాలు ఎక్కువ.
ఈ సమస్యను ఒక్కసారిగా తగ్గించడం కష్టమే.కాని మెల్లిగా, ఓపిగ్గా దీనిపై పోరాటం చేయవచ్చు.
అలా మెల్లిగా బీపి సమస్యపై పోరాటం చేసే ఓపిక, శక్తి ఉన్నవారి కోసం ఓ స్పెషల్ టీ.బీపిని కంట్రోల్ లో పెట్టే టీ.
ఈ స్పెషల్ టీ తయారి కోసం మనకు కావాల్సినవి ఆకుకూరలు, ఖర్జూర మరియు మంచినీరు.ఆకూకూరలు, ఖర్జూర ఎందుకు అంటే, ఆకుకూరల్లో కంస్ట్రిక్టెడ్ ఆర్టెరీస్ కి రిలాక్సేషన్ ఇచ్చే లక్షణాలు ఉంటాయి.
ఇక ఖర్జూరలో దొరికే పొటాషియం బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది.
ఇక తయారు చేసుకునే విధానం చాలా సింపుల్.100 గ్రాముల ఆకుకూర, 50 గ్రాముల ఖర్జూర, బాటిల్ లో మంచినీరు తీసుకోండి.ఆకుకూర, ఖర్జూర కట్ చేసి ఓ బోవెల్ లో వేసి, మంచినీళ్లు పోసి ఓ అరగంట సేపు మరగపెట్టండి.
అంతే సింపుల్ .టీ రెడీ.దీన్ని రోజుకి మూడుపూటలూ తాగితే, బీపి ఎందుకు కంట్రోల్ కాకుండా ఉంటుంది.