ఇప్పటివరకు ఎవరికీ తెలియని సపోటా రహస్యం.... ముఖ్యంగా మగవారికి

సపోటా పండు తియ్యగా ఉండి మన ఆరోగ్యానికి సహాయపడే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.సపోటాలో పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు రెండు సపోటా పండ్లను తినటం వలన మన శరీరానికి కాఫర్,కాలిష్యం, పొటాషియం,ఫైబర్,విటమిన్స్ A,B,C,పాస్పరస్ వంటి పోషకాలు బాగా అందుతాయి.

 Health Benefits Of Sapota-TeluguStop.com

ఈ పండు జీర్ణశక్తిని పెంచటమే కాకుండా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.సపోటా పండులో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు రాకుండా చూడటమే కాకుండా కంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

సపోటా పండులో యాంటీ ఏజింగ్ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన వృధాప్య లక్షణాలను తగ్గించి చర్మంపై తొందరగా ముడతలు రాకుండా కాపాడతాయి.


సపోటా పండులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండుట వలన అలసినప్పుడు రెండు సపోటా పండ్లను తింటే తక్షణం శక్తివస్తుంది .సపోటా పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన రెండు సపోటా పండ్లను తింటే మలబద్దకం సమస్య నుండి బయట పడవచ్చు.

రాత్రి సరిగా నిద్రపట్టని వారు పడుకొనే ముందు ఒక సపోటా పండును తింటే నిద్ర బాగా పడుతుంది.

సపోటాలో యాంటీ వైరల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి జలుబు,దగ్గు,ఇన్ ఫెక్షన్స్ వంటివి మన దరికి చేరకుండా కాపాడతాయి.లైంగిక సమస్యలు ఉన్నవారు సపోటాను తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సపోటాలో పిండి పదార్ధాలు,పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు,పాలు ఇచ్చే తల్లులకు చాలా మంచిది.అలాగే శారీరక ఒత్తిడి,నరాల బలహీనతను తగ్గించటంలో సహాయపడుతుంది.

ప్రతి రోజు రెండు సపోటా పండ్లను తింటే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.

సపోటాలో కాఫర్,కాలిష్యం, పొటాషియం,ఫైబర్,విటమిన్స్ A,B,C,పాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన సపోటా తిన్నప్పుడు ఈ పోషకాలు అన్ని మన శరీరానికి అంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది.

అలాగే ఎముకలు బలంగా ఉండటానికి, జుట్టు రాలకుండా ఎదగటానికి బాగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube