సూర్యకి చుక్కలు చూపిస్తున్న నిర్మాత

ఏ సినిమా అయినా, పూర్తయ్యేవరకు విడుదల తేది అనౌన్స్ చేయకపోతేనే మంచిది.ఓ విడుదల తేదికి చెప్పి రాకపోతే, సినిమా కొన్నవారిలో కలవరం పెరుగుతుంది.

 Singam 3 Telugu Version Producer Asks Surya To Pay Money Back?-TeluguStop.com

తీసుకున్న అప్పుల వడ్డీ పెరిగిపోతుంది.దాంతో ఎక్కడ లేని కష్టాలు సినిమాను చుట్టుకుంటాయి.

సరిగ్గా ఇదే జరుగుతోంది ఇప్పుడు సూర్య సింగం 3 సినిమా విషయంలో.

డిసెంబర్ 16న వస్తున్నాం అని ఎప్పుడో ప్రకటించారు.

అల్లు అరవింద్ అభ్యర్ధన మీద రామ్ చరణ్ ధృవ కోసం సినిమాని 23వ తేదికి వాయిదా వేసుకున్నారు బాగుంది కాని ఇప్పుడు ఆ తేదికి కూడా రావట్లేదు కదా.దాంతో బయ్యర్లలో ఎక్కడలేని టెన్షన్.సినిమా ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా కనబడట్లేదు.

దీంతో తెలుగు హక్కులు ఏకంగా 18 కోట్లకి తీసుకున్న శివకుమార్, తన డబ్బులు తనకి వెనక్కి ఇచ్చేయాలని, ఇక ఈ సినిమాని తానూ పంపిణి చేయాలకుకోవట్లేదని సూర్యని అడుగుతున్నాడట.

మరి సూర్య ఏం చేస్తాడో, ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమిళ వెర్షన్ నిర్మాతని ఎలా ఆదుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube