బ్రేక్‌ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఖ‌తం!

ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం గా మారిపోయింది.కుటుంబ పోషణ మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడం కోసం డబ్బు సంపాదనలో పడిపోతున్నారు.

 Side Effects Of Eating Bread For Breakfast Details, Breakfast, Bread, Eating Br-TeluguStop.com

కనీసం తినడానికి కూడా టైం లేనంత బిజీ అవుతున్నారు.ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను( Bread ) తీసుకోవడం మనలో ఎంతోమందికి ఉన్న కామన్ అలవాటు.

టిఫిన్ చేసుకునేంత స‌మ‌యం లేకపోవడంతో బ్రెడ్ కు జాబ్ లేదా పీనట్ బటర్ పూసుకుని తినేయడం కడుపు నింపుకోవడం చేస్తుంటారు.కానీ ఇలా తరచూ బ్రేక్ ఫాస్ట్ లో( Breakfast ) బ్రెడ్ తీసుకోవడం సరైన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు.

బ్రెడ్ ను అధికంగా తిన‌డం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Telugu Bread, Bread Effects, Breakfast, Diabetes, Tips, Healthy, Heart Diseases,

త‌ర‌చూ బ్రెడ్ ను తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు త‌లెత్తుతాయి.అందులో ముఖ్య‌మైన‌ది మ‌ధుమేహం.( Diabetes ) బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగడానికి కారణమవుతాయి.మ‌రియు మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ ను పెంచుతాయి.అలాగే నిత్యం బ్రెడ్ తినేవారు భారీగా బ‌రువు పెరుగుతారు.బ్రెడ్ లోని అధిక కార్బ్ కంటెంట్ ఆకలిని పెంచుతుంది.

దాంతో ఏది ప‌డితే అది తినేస్తుంటారు.ఫ‌లితంగా వెయిట్ గెయిన్( Weight Gain ) అవుతారు.

Telugu Bread, Bread Effects, Breakfast, Diabetes, Tips, Healthy, Heart Diseases,

వైట్ బ్రెడ్( White Bread ) ఎక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది.ప్రాసెసింగ్ సమయంలో శుద్ధి చేసిన గోధుమ పిండి దాని సహజ పోషకాలను కోల్పోతుంది.పైగా బ్రెడ్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం పొటాషియం బ్రోమేట్ వంటి హానికరమైన రసాయనాలను వాడ‌తారు.అటువంటి బ్రెడ్ ను మ‌నం త‌ర‌చూ తింటే గుండె జబ్బులు వ‌చ్చే ప్ర‌మాదం పెరుగుతంది.

అంతేకాదు బ్రెడ్‌లో ఉపయోగించే ఎమల్సిఫైయర్‌లు గట్ మైక్రోబయోమ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.దీని వల్ల జీర్ణ అసౌకర్యం మరియు గట్ అవరోధం వంటి స‌మ‌స్య‌లు తలెత్తాయి.

నిత్యం బ్రెడ్ తిన‌డం వ‌ల్ల ఉబ్బరం, మలబద్ధకం మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి కడుపు సమస్యలు కూడా ఇబ్బంది పెడ‌తాయి.కాబ‌ట్టి ఇక‌నైనా బ్రెడ్ పై ఆధార ప‌డ‌టం మానేసి బ్రేక్ ఫాస్ట్ లో మంచి ఆహారం తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోండి.

ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube