వెండి నెమలి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మనం మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించినట్టే వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో విశ్వసిస్తాము.మనకు ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా వచ్చిన సమస్యలు తొలగిపోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాస్తు శాస్త్రజ్ఞులని కలిసి వాస్తు దోషాలు తొలగిపోవడానికి పరిష్కార మార్గాలను అడుగుతాము.

 Keep Silver Peacock Idol In House For Improving Financial Status, Peacock, Silve-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలా మంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తుంటారు.ఇలా కష్టపడి సంపాదించిన డబ్బులు వారి దగ్గర నిల్వ లేకపోవడంతో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఇలా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం వాస్తుశాస్త్రజ్ఞులు కొన్ని పరిష్కార మార్గాలను తెలియజేస్తున్నారు.

మన ఇంట్లో తరచూ ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతుంటే సంపదకు మూలకారకుడయిన కుబేరుడిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తారు.

అదే విధంగా లక్ష్మీదేవికి ప్రతిరూపం అయినటువంటి నెమలిపింఛం మన ఇంట్లో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అయితే మన ఇంట్లో వెండితో తయారుచేసి, నాట్యమాడుతూ ఉన్నటువంటి నెమలి విగ్రహం ఉండటం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవని పండితులు తెలియజేస్తున్నారు.

Telugu Lakshmi Devi, Peacock, Silverpeacock, Silver Peacock, Telugu Bhakthi, Tel

ఇంట్లో లేదా ఆఫీసులలో అనేక సమస్యలతో బాధపడేవారు వెండి నెమలి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వల్ల ఏ విధమైన ఎటువంటి సమస్యలు ఉండవని పండితులు తెలియజేస్తున్నారు.ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్న తొలగిపోతాయి.అదే విధంగా మన ఇంట్లో డబ్బులు నిల్వ చేసే లాకర్ కూడా ఎప్పుడూ కూడా నైరుతి దక్షిణ గోడకు పెట్టుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.ఇలా కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తూ కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే నిల్వ ఉంటుందని అక్రమంగా సంపాదించిన డబ్బు ఉండదని పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube