హిందూ మతంలోని ముఖ్యమైన దేవతల్లో సరస్వతీ దేవి ఒకరు.చదువుల తల్లిగా ఆరాధింపబడుతున్న ఈ అమ్మ.
త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి.వేదాలు, పురాణాల్లో సరస్వతీ దేవి గురించి చాలా విషయాలను చెప్పబడ్డాయి.
దేవీ నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీ దేవిని ప్రముఖంగా ఆరాధిస్తారు.అయితే ఈ విషయాన్ని మనకు తెలుసు.
అలాగే ఆమె చేతిలో వీణ పట్టుకొని, తెలుపు రంగు బట్టలు ధరించి హంసపై లేదా రాయిపై కూర్చుని కనిపిస్తూ ఉంటుంది.అయితే మన ఇంట్లోనే లేదా వేరే వాళ్ల ఇళ్లల్లోనో ఉండే అమ్మవారి ఫొటోలో సరస్వతీ దేవి రాయిపై కూర్చొని మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అయితే ఇందుకు కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సరస్వతీ దేవి ఏ పటంలోనైనా రాతి మీద వీణ పట్టుకునే కూర్చునే ఉంటుంది.
లక్ష్మి దేవిలా నిలకడ లేని తామర పువ్వులో తన స్థానం ఉండదని చెప్పటమే ప్రధాన ఉద్దేశ్యము.సిరి సంపదలు హరించుకు పోవచ్చు.
నేర్చుకున్న విద్య, విజ్ఞానం ఎక్కడికి పోలేనివని ఈ భంగిమకు అర్థం – పరమార్థం.సరస్వతి దేవి వాహనము హంస.
హంస చాలా జ్ఞానము కలది.పాలు, నీళ్ళు కలిపి దాని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది.
అలాగే విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చునని మనం నేర్చుకోవచ్చు.సరస్వతీ దేవిని కేవలం విద్యను మాత్రమే కాకుండా సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది.