ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడిగా కంటే, పొలిటికల్ కమెడియన్ గానే ఎక్కువమంది చూస్తూ ఉంటారు.దీనికి తగ్గట్లుగానే ఆయన ప్రవర్తన ఆయన మాటలు ఉంటాయి.తాను త్వరలోనే ప్రధానమంత్రి అవుతానని, తెలంగాణలోనూ ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసినా, ఎక్కడ ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేదు.ప్రస్తుతం కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు.తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ప్రజాశాంతి పార్టీ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు . దీనికోసం రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణ అమరవీరుల కుటుంబాలను టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని , కానీ ప్రజాశాంతి పార్టీ వారికి సరైన న్యాయం చేస్తుందని కె.ఎ.పాల్ చెబుతున్నారు. ఇప్పటికే 200 మంది అమరవీరుల కుటుంబాలు తనతో టచ్ లో ఉన్నారని 100 మంది కుటుంబాలు ప్రజాశాంతి పార్టీలో చేరారని కె ఏ పాల్ వ్యాఖ్యానించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు అమరవీరుల కుటుంబాలకు ఇస్తానని పాల్ ప్రకటించారు.తాజాగా తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి ని ప్రజాశాంతి పార్టీ లో చేర్చుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కె ఏ పాల్ పై టీఆర్ఎస్ నేత.అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన కామెంట్ చేశారు.
తన భర్త వెంకటాచారిని పాల్ మభ్యపెట్టి తన పార్టీలో చేర్చుకున్నారు అని విమర్శించారు.తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని, తనకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నారని, దీనిపై ఆరా తీస్తే ఇదంతా అసత్యం గా తేలిందని శంకరమ్మ మండిపడ్డారు.తాను 40 కోట్లు డిమాండ్ చేసినట్లు పాల్ చెబుతుండడం పై ఆమె మండిపడ్డారు.ప్రస్తుతం అమరవీరుల కుటుంబాలను తమ వైపు తిప్పుకునేందుకు పాల్ ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో… టిఆర్ఎస్ నేతలు దీనిపై అప్రమత్తమయ్యారు.
ఇప్పుడు శంకరమ్మ ద్వారానే పాల్ పై విమర్శలు చేయిస్తు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.