బాన పొట్ట(బెల్లీ ఫ్యాట్).కోట్లాది మందిని సతమతం చేస్తున్న సమస్యల్లో ఇది ముందు వరసలో ఉంటుంది.
జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, బేకరీ ఫుడ్స్-ఆయిలీ ఫుడ్స్-షుగర్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, మద్యపానం, ధూమపానం, శరీరానికి శ్రమ లేకపోవడం, గంటలు తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం వంటి రకరకాల కారణాల వల్ల కొవ్వు పేరుకుపోయి నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బానలా తయారవుతుంది.దాంతో పెరిగిన పొట్టను కరిగించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే హైరానా పడకుండా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను తీసుకుంటే.మీ బాన పొట్ట ఫ్లాట్‌గా మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక కివి పండును తీసుకుని తొక్క చెక్కేసి స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.

అలాగే వాటర్‌లో కడిగిన రెండు ఉసిరి కాయలను తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.చిన్న అల్లం ముక్కను కూడా తీసుకుని పీల్ తొలగించి వాటర్‌లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కివి పండు స్లైసెస్, ఉసిరి కాయ ముక్కలు, అల్లం ముక్క, పావు స్పూన్ మిరియాల పొడి, ఐదు కరివేపాకు ఆకులు, పావు స్పూన్ నల్ల ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కివి-ఆమ్లా జ్యూస్ సిద్ధం అవుతుంది.

వారంలో కనీసం మూడు సార్లు అయినా ఈ జ్యూస్‌ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వ క్రమంగా కరిగిపోతుంది.మీ బాన పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది.అంతేకాదు, కివి-ఆమ్లా జ్యూస్‌ను తాగితే వెయిట్ లాస్ అవుతారు.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ తొలగిపోతాయి.ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.మరియు చర్మం ఆరోగ్యంగా, నిగారింపుగా కూడా మెరుస్తుంది.







