ప్ర‌స‌వం త‌ర్వాత వేగంగా బ‌రువు త‌గ్గాలంటే దీన్ని డైట్‌లో చేర్చాల్సిందే!

ఎంత సన్నగా ఉన్న వారైనా ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరిగి లావుగా మారడం సర్వసాధారణం.అయితే ప్రసవం అనంతరం దాదాపు అందరూ మునుపటి మాదిరిగా సన్నగా మారడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.

 Add This To Your Diet To Lose Weight Fast After Delivery, Delivery, Lose Weight,-TeluguStop.com

కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.మీరు ఈ జాబితా లో ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ప్రసవం తర్వాత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఎప్పుడు తీసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న కీర దోస‌కాయ‌, ఒక పైనాపిల్‌, రెండు ఉసిరి కాయ‌లు, పుచ్చ‌కాయ తీసుకుని.చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత బ్లెండర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న అర కప్పు కీర దోసకాయ ముక్కలు, ఒకటిన్నర కప్పు పుచ్చకాయ ముక్కలు, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి కాయ ముక్కలు వేసుకోవాలి.

వాటితో పాటుగా వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె, చిటికెడు నల్ల ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ సిద్ధమయినట్టే.

ప్రసవం అనంతరం ఈ జ్యూస్ ను రోజులో ఏదో ఒక సమయంలో తీసుకుంటే శరీరంలో పేరుకు పోయిన కొవ్వు, క్యాలరీలు త్వరగా కరుగుతాయి.వేగంగా బరువు తగ్గుతారు.

Telugu Amla, Delivery, Tips, Kheera, Latest, Lose, Pineapple, Pregnancy, Waterme

పైగా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు లభిస్తాయి.బాడీ లో పేరుకు పోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.సీజ‌నల్ వ్యాధులు సైతం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube