పాడుతా తీయగా( padutha theeyaga ).ఈ షో కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉండేది.
దీన్ని వ్యాఖ్యాతగా ఎస్పీ బాలు( SP Balu ) నడిపిన విధానం ఎందరికో హోస్ట్ గా టెలివిజన్ ఇండస్ట్రీ లో నిలబడేందుకు ఆదర్శం అయ్యింది.అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది గాయని గాయకులూ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.
వారికి ఇదొక అద్భుతమైన ప్లాట్ ఫార్మ్ గా ఉపయోగపడింది.ఆలా ఎంతో ఘన చరిత్ర కలిగిన పాడుతా తీయగా షో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ఈ షో టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి రియాలిటీ షో గా కూడా పేరు దక్కించుకుంది.ఈటీవీ లో ప్రసారం అవుతున్న పాడుతా తీయగా షో ను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు కొన్ని వందల రియాలిటీ షోలు వస్తున్నాయి.

అయితే కొన్నాళ్ల క్రితం వచ్చిన ఈ షో మధ్యలో ఆగిపోయిన మళ్లి బాలు గారు పూనుకొని తిరిగి ప్రారంభించారు.అయన కన్ను మూసే వరకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సాగిన పాడుతా తీయగా బాలు కరోనా తో కన్నుమూయడం తో ప్రశ్నార్ధకంగా మారిపోయింది.అయితే ఆయన తనయుడు చరణ్( Charan ) ఈ షో కి వ్యాఖ్యాత గా ప్రస్తుతం జరుగుతుంది.కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చింది.తండ్రిని మరిపించడం కోసం తానే బాలు అనేవిధంగా అతడిని అనుసరిస్తూ కాస్త అతి చేస్తునందు ఎస్పీ చరణ్.అందుకోసం పనికి మాలిన జోకులు వేస్తూ దారి తప్పిస్తూ నడిపిస్తున్నాడు.
మాములుగా గాయకులు చాల సున్నితంగా ఉంటారు.అలాగే బాలు గారు కామెడీ కూడా అలాగే ఎంతో సున్నితంగా ఉంటూ అల్లరి చేసిన హుందాగా ఉండేవారు.

కానీ చరణ్ తన తండ్రిని ఇమిటేట్ చేస్తూ, అల్లరిగా ఎదో చేయాలనీ ప్రయత్నించి బొక్క బోర్లా పడుతున్నట్టుగా అనిపిస్తుంది.చూసేవారికి అది చాల అతిగా కనిపిస్తుంది.మరి ముందు ముందు ఈ వైఖరి మారకపోతే పాడుతా తీయగా అనే షో ఒకటి ఉండేది అని జనాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తచ్చు.బాలు గారు కన్నుమూసాక చాల మంది బాలు ని అయన కొడుకు చరణ్ లో చూసుకోవాలని అనుకోవడం వల్లే ఇదంతా జరుగుతుంది.
ఎప్పటికి బాలు గారు బాలు గారే.