హీరోయిన్ వాణిశ్రీ. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.
అయితే నేటితరం ప్రేక్షకులకు ఈమె గురించి కాస్త తెలియక పోయినప్పటికీ.నిన్నటి తరం ప్రేక్షకులు మాత్రం వాణిశ్రీ పేరు చెప్పగానే ఆమె ఒక గొప్ప నటి అని కితాబు ఇస్తూ ఉంటారు.
ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అంత గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించింది వాణిశ్రీ.విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నటనకు కేంద్ర బిందువుగా కొనసాగింది అని చెప్పాలి.
ఆమె ఎలాంటి పాత్రలో నటించిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ప్రాణం పోస్తూ ఉండేది.
ఇక ఎన్నో సూపర్ డూపర్ సినిమాలలో కూడా నటించింది అని చెప్పాలి.
ఇలాంటి సినిమాలలో ప్రేమనగర్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అక్కినేని తో మాత్రమే కాదు శోభన్ బాబు తోనూ ఎన్నో లవ్ స్టోరీ కాన్సెప్ట్ సినిమాల్లో నటించింది వాణిశ్రీ.ఏఎన్ఆర్ తో మాత్రం కాస్త ఎక్కువ సినిమాలు ఉండడం గమనార్హం.
అయితే నాగేశ్వరరావు తో సినిమా అయినా స్టోరీ డిస్కషన్ మాత్రం ఎన్టీఆర్ తో ఉండేదట.అదేంటి అలా ఎలా కుదురుతుంది అని అనుకుంటున్నారు కదా.
ఇంతకీ ఏం జరిగిందంటే.అప్పట్లో ఒకే స్టూడియోలో రెండు మూడు సినిమాలకు షూటింగ్లకు అద్దెకు ఇచ్చేవారు.

దీంతో ఒకవైపు నాగేశ్వరరావు సినిమాలో నటిస్తూనే మరోవైపు గ్యాప్ వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ తో ముచ్చట్లు పెడుతూ ఉండేదట హీరోయిన్ వాణిశ్రీ.ఒకప్పుడు కథ రెడీ అయ్యాక దర్శకులు మార్కులు చేర్పులు చేసేవారు కాదు.కానీ వాణిశ్రీ అన్నగారికి చెప్పడంతో ఇక అన్నగారు దర్శకులకు చెప్పి వారిని ఒప్పించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట.ఇక తర్వాత కాలంలో శారద, జమున లాంటి వారు కూడా అన్నగారితో స్టోరీ డిస్కర్షన్లు చేసేవారట.
ఇలా అన్నగారితో ఎన్నో స్టోరీలు డిస్కషన్ చేసినప్పటికీ అటు ఇండస్ట్రీలో వాణిశ్రీ ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు తోనే కావడం గమనార్హం.అన్నగారితో కూడా పలు సినిమాలలో నటించింది వాణిశ్రీ.