సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్6 లో అడుగు పెడుతున్నాడంటే ప్రేక్షకులకు ప్రేక్షకులకు భారీ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని అందరూ భావించారు.అయితే శ్రీహాన్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో అశించిన రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే శ్రీహాన్ నామినేషన్లలో ఉంటే అతనిని నామినేషన్స్ నుంచి సేఫ్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు.
అయితే తాజాగా సిరి హన్మంత్ నెటిజన్లతో ముచ్చటిస్తూ శ్రీహాన్ గురించి షాకింగ్ సీక్రెట్లను వెల్లడించారు.
శ్రీహాన్ ను మొదట నేను నాన్న అని పిలిచేదానినని ఆ తర్వాత నన్ను అలా పిలవకు అని శ్రీహాన్ నాతో అన్నాడని అప్పటినుంచి కన్నా అని పిలుస్తున్నానని సిరి చెప్పుకొచ్చారు.శ్రీహాన్, సిరిలకు ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమో అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ షోకు వెళతారా అనే ప్రశ్నకు బిగ్ బాస్ షోకు మళ్లీ వెళ్లడం తన వల్ల కాదని సిరి వెల్లడించడం గమనార్హం.ఈ నెల 19వ తేదీన శ్రీహాన్ పుట్టినరోజు కాగా బిగ్ బాస్ నిర్వాహకులు సిరి హన్మంత్ ద్వారా ఏదైనా సర్పైజ్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.
శ్రీహాన్ సిరిలను ఒకే సీజన్ లో బిగ్ బాస్ హౌస్ కు పంపి ఉంటే బాగుండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
బిగ్ బాస్ సీజన్6 లో టాస్క్ లు రొటీన్ గా ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సీజన్ గత సీజన్లలా ఆకట్టుకోవడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ కామెంట్ల గురించి బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.