వారానికి ఒక్కసారి ఇలా షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్‌కు దూరంగా ఉండొచ్చు!

హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem )తో బాధపడుతున్నారా.? ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే విధంగా వారానికి ఒక్కసారి షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

 Shampooing Like This Once A Week Will Reduce Hair Fall!,shampooing, Hair Fall, S-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం హెయిర్ ఫాల్ ను నివారించుకోవడానికి ఎలా షాంపూ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Fall-Telugu Health

ముందుగా ఒక చిన్న బీట్ రూట్( Beetroot ) ను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను తీసుకుని తొక్క చెక్కేసి సన్నగా తురిమి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో క‌ట్ చేసి పెట్టుకున్న‌ బీట్ రూట్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, రెండు తుంచిన బిర్యానీ ఆకులు, వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసి కనీసం పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం ప‌డుతుంది.

Telugu Care, Care Tips, Fall-Telugu Health

అదే స‌మ‌యంలో జుట్టు కుదుళ్లు సూప‌ర్ స్ట్రోంగ్ గా మార‌తాయి. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.అంతేకాదు పైన చెప్పిన‌ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు సిల్కీగా, షైనీగా( Silky and Shiny Hair ) మెరుస్తుంది.

కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో.వారు తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube