ఈ హోమ్ మేడ్ షాంపూతో హెయిర్ ఫాల్, డాండ్రఫ్ రెండూ ఖతం!

హెయిర్ అండ్ స్కాల్ప్ హెల్తీగా మ‌రియు క్లీన్ గా ఉండాలి అంటే వారానికి కచ్చితంగా రెండు సార్లు తల స్నానం ( Head bath )చేయాలి.ప్రస్తుతం మనకు ఎన్నో రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి.

 This Homemade Shampoo Helps To Get Rid Of Hair Fall And Dandruff! Homemade Shamp-TeluguStop.com

అయితే అన్నిటిలోనూ కెమికల్స్ ఉంటాయి.రసాయనాలు అధికంగా నిండి ఉండే షాంపూలను వినియోగించడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ షాంపూను వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.పైగా హెయిర్ ఫాల్, డాండ్రఫ్ రెండు సమస్యలు ఖతం అవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హోమ్ మేడ్ షాంపూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( spoons of flax seeds ), రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ), రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ) మరియు పది గింజ తొలగించిన కుంకుడు కాయలు ( Saffron Nuts )వేసుకోవాలి.

అలాగే మూడు గ్లాసులు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను చేత్తో మెత్త‌గా చేసుకోవాలి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Healthy, Natural Shampoo, Homemadeshampo

ఇప్పుడు స్ట‌వ్ పై నానబెట్టుకున్న పదార్థాలను పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.దాంతో మన షాంపూ అనేది రెడీ అవుతుంది.స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో షాంపూను ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో త‌యారు చేసుకున్న షాంపూను నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Healthy, Natural Shampoo, Homemadeshampo

ఈ న్యాచురల్ షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఈ షాంపూ జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తుంది.కుదుళ్ల‌ను బ‌లోపేతం చేస్తుంది.తలపై చుండ్రును సంపూర్ణంగా తొలగిస్తుంది.స్కాల్ప్ ను హెల్తీగా మారుస్తుంది.కురుల‌ను సైతం ఆరోగ్యంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube