రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చీర్ల లక్ష్మి తీవ్ర అనారోగ్యం తో బాద పడుతున్నపరిస్థితి నీ తెలుసుకున్న గొల్లపల్లి గ్రామ అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ ఆకుల మురళీమోహన్ గౌడ్ 50 కిలోల బియ్యం వితరణ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.భార్య లక్ష్మి అనారోగ్యం,భర్త వెంకటేశం ఏ పని చేయలేనీ స్థితిలో వుండటం తో ఆ కుటుంబం దీన స్థితికి పలువురు పూసల కులసంగానికి చెందిన నాయకులు కూడా చలించిపోయి వారికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో మురళీమోహన్ గౌడ్ తో పాటుపూసల సంఘం నాయకులు మద్దివేని లక్ష్మణ్, ఏం.కృష్ణ,ఏం.శ్రీధర్,కోనేటి సతీష్,దేవయ్య,శ్రీనివాస్, తో పాటు పలువురు పాల్గొన్నారు.