మల్కపేట రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం పరిశీలించారు.మల్కపేట రిజర్వాయర్ లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అని జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి ని ఆరా తీయగా, ఈ రోజు 0.75 టీ ఎం సీ ల డెడ్ స్టోరేజ్ నీరు నిల్వ ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.

 Collector Inspects Malkapet Reservoir, Collector Sandeep Kumar Jha, Malkapet Re-TeluguStop.com

బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి 0.5 టీఎంసీ నీటి విడుదలకు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.ఈ నీరు మల్కపేట రిజర్వాయర్ కు చేరుకోగానే.దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు.నీటి పారుదల శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డీఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube